వరలక్ష్మి శరత్ కుమార్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె పేరు వినిపిస్తోంది. ఎందుకంటే ఈమె పెళ్లికి సంబంధించి ఆహ్వాన పత్రికలను దేశంలోని ప్రముఖులు, హీరోలు, రాజకీయ నాయకులందరికీ అందించింది. ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికలన్నీ అంది పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. ఇదే తరుణంలో శరత్ కుమార్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె సినిమాల్లో హీరోయిన్ గా చేసే సమయంలో ఒక డైరెక్టర్, డైరెక్ట్ గా రూమ్ కి రమ్మన్నారట. అందుకే ఆమె హీరోయిన్ గా చేయడం మానేశానని తెలియజేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
న్యూస్ లైన్ డెస్క్: వరలక్ష్మి శరత్ కుమార్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె పేరు వినిపిస్తోంది. ఎందుకంటే ఈమె పెళ్లికి సంబంధించి ఆహ్వాన పత్రికలను దేశంలోని ప్రముఖులు, హీరోలు, రాజకీయ నాయకులందరికీ అందించింది. ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికలన్నీ అంది పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. ఇదే తరుణంలో శరత్ కుమార్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె సినిమాల్లో హీరోయిన్ గా చేసే సమయంలో ఒక డైరెక్టర్, డైరెక్ట్ గా రూమ్ కి రమ్మన్నారట. అందుకే ఆమె హీరోయిన్ గా చేయడం మానేశానని తెలియజేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
సీనియర్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఈమె తమిళ్ లో హీరోయిన్ గా చేస్తూనే తెలుగులో విలన్ పాత్రలు కూడా చేస్తూ వచ్చింది. ఈ విధంగా తను డిఫరెంట్ యాక్టింగ్, అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. ఇండస్ట్రీలో అమ్మాయిలు రాణించడం చాలా కష్టమవుతుంది. మా నాన్నకు ఇష్టం లేకుండా నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. మొదట్లో కాస్త ఇబ్బందులు పడ్డ ఇప్పుడు అలవాటయిపోయింది.
మొదట్లో ఒక తెలుగు టీవీ ఛానల్ అధినేత డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి ఒక ప్రాజెక్టు ఉందని అందులో నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటానని చెప్పాడు. నేను కూడా ఆఫర్ కు ఓకే చెప్పాను. అలా కొంతసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత మనం బయట ప్రైవేటుగా హోటల్లో కలుద్దాం అక్కడికి రా అని చెప్పాడు. నేను ఎందుకు అని ప్రశ్నించగా మనం సీక్రెట్ గా ఆ రూమ్లో మాట్లాడుకుందాం అన్నాడు. ఈ విధంగా ఒక స్టార్ హీరో కూతురు అయిన నన్నే ఈ విధంగా ఆయన కమిట్మెంట్ అడిగితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నేను హీరోయిన్ పాత్రలు మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వస్తున్నానని తెలియజేసింది.