ఒకప్పటి స్టార్ కమెడియన్ బబ్లు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడంటే.?

ఒకప్పుడు ఇండస్ట్రీలో వారి నటనతో ఊపు ఊపిన నటీనటులు  ఆ తర్వాత కొన్నాళ్లకు ఏదో ఒక కారణంగా ఇండస్ట్రీ నుంచి దూరమవుతారు. అలాంటి వారిలో  ఈ నటుడు కూడా ఒకరు. ఇప్పుడు తనదైన కామెడీతో


Published Oct 05, 2024 01:43:00 PM
postImages/2024-10-05/1728113968_bablu.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు ఇండస్ట్రీలో వారి నటనతో ఊపు ఊపిన నటీనటులు  ఆ తర్వాత కొన్నాళ్లకు ఏదో ఒక కారణంగా ఇండస్ట్రీ నుంచి దూరమవుతారు. అలాంటి వారిలో  ఈ నటుడు కూడా ఒకరు. ఇప్పుడు తనదైన కామెడీతో చాలామంది హీరోల పక్కన  కమెడియన్ గా చేసేవారు బబ్లు. వెండితెర పైన కాకుండా బుల్లితెరపై కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన  స్టార్ హీరోల పక్కన కూడా నటించారు. 20వ దశకంలో మంచి క్రేజ్ సంపాదించిన బబ్లు ఆకస్మాత్తుగా  ఇండస్ట్రీకి దూరమైపోయాడు.

మరి బబ్బు ఎక్కడికి వెళ్లాడు. ఏం చేశాడు అనేది చూద్దాం.. ముద్దుగా బబ్లు అని పిలుస్తారు. అసలు పేరు సదానంద్. ఐదు సంవత్సరాల వయసులోనే ముద్దుల మేనల్లుడు అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం మూవీతో కమెడియన్ గా మారాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. అలా ఎంతో మంది హీరోలతో ఆయన తెరను పంచుకొని చివరికి  తన లైఫ్ లో ఎదురైన విషాదాల వల్ల డిప్రెషన్ కు లోనయ్యాడట.

2012లో తండ్రి మరణం, ఆ తర్వాత 2022లో చెల్లి చనిపోవడం, అలా మరో సంవత్సరం మేనత్త కొడుకు మరణించడంతో ఈయన చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టిందని  అలా బ్యాంకాక్ వెళ్లిపోయి అక్కడ డీజేగా పని చేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఒక ఫిల్మ్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారని, త్వరలోనే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తానని కూడా చెప్పుకొచ్చారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu uday-kiran bablu sadanandh arya muddula-menalludu

Related Articles