రీసెంట్ గా ‘సామజవరగమన’ ‘ఓం భీం బుష్’ వంటి సక్సెస్ లతో తన మార్కెట్ కూడా పెరిగింది
నటినటులు:శ్రీవిష్ణు, రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, తదితరులు
దర్శకత్వం:హసిత్ గోలి
నిర్మాత:టీజీ విశ్వప్రసాద్
సంగీతం:వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ:వేదరామన్ సంకరన్
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శ్రీవిష్ణు అంటేనే మినిమమ్ కొత్త కాన్సప్ట్ . ఎలా వెతుకుతాడో కాని భలే డిఫరెంట్ కాన్సప్ట్ తో ఎప్పుడు హిట్టు కొడుతుంటాడు. రీసెంట్ గా ‘సామజవరగమన’ ‘ఓం భీం బుష్’ వంటి సక్సెస్ లతో తన మార్కెట్ కూడా పెరిగింది. ఇప్పుడు ‘శ్వాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు అసలు సినిమా ఎలా ఉందో చూసేద్దాం.
కథ:
‘శ్వాగ్’ మూవీ.. 1550 కాలంలో మాతృస్వామ్యం, పితృస్వామ్య వ్యవస్థల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. భవభూతి మహారాజు(శ్రీవిష్ణు) తన సతీమణి(రీతువర్మ) వద్ద బానిసగా బతుకుతుంటాడు. తన బానిస బ్రతుకును వదిలి మళ్లీ పితృస్వామ్య వ్యవస్థని తీసుకొని రావడానికి ఓ పథకం పన్నుతాడు.పథకం సక్సస్ అయ్యి మళ్లీ పితృస్వామ్య వ్యవస్థ మొదలవుతుంది. ఇలాంటి టైంలో తన రాజ్యంలో ఓ నపుంసకుడని చంపేస్తాడు. ఆ పాపం శాపమై భవభూతి వంశంలో ఆడపిల్లలు ఉండరు. ఆఖరికి మగకవలలు పుట్టినా వారిలలో ఒకరు నపుంసకుడిగా మారతాడు . ఒకడు తండ్రికి దూరం అవుతాడు. ఇక వంశాన్ని వృద్ధి చేసే వారసుడు లేనిదే ఆస్తి దక్కదు. ఈ టైంలో మళ్లీ రీతూ వర్మ. శ్రీవిష్ణు తెరపైకి వస్తారు..వీరికి ఆ వంశంతో ఏం సంబంధం అనేదే సినిమా.
కథ చాలా బాగున్నా...చిన్న కన్ఫ్యూజన్ తో అందరికి కాక కొందరికే అర్ధమయ్యేలా చేసింది.మొదలైన అరగంట వరకు అసలు కథ ఏమిటో అర్థం అవ్వదు. వీరందరిలో భవభూతి క్యారెక్టర్ కాస్త ఎంటర్టైన్ చేస్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. కాని ఎవరు ఎవరికి ఏమవుతారేది ..పెద్ద టాస్క్ లా అనిపిస్తుంది. ఇక క్లైమ్యాక్స్ లో లింగ వివక్ష స్థాయిని చూపెట్టిన విధానం ఆలోచింపజేసే విధంగా సాగింది. సినిమా చాలా చాలా బాగుంది. కాని అందరికి అర్ధం కాదనే చెప్పాలి.
రీతూ వర్మ, దక్ష, మీరా జాస్మిన్, శరణ్య ప్రదీప్ క్యారెక్టర్స్ బాగున్నాయి. ఇక రవిబాబుకి చాలా రోజుల తరువాత ఫుల్ లెంత్ రోల్ పడింది. సునీల్ ఉన్నంత సేపు ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ బాగుండి ఉంటే ఇంకా బాగుండేది. సినిమా ఇంకాస్త షార్ప్ గా ఉండాలి. సినిమాటోగ్రఫీ మాత్రం చక్కగా ఉంది. ఆల్ ఓవర్ గా సినిమా సూపరే కాని ఇంకాస్త శ్రధ్ధ పెట్టి ఉంటే సూపర్ డూపర్ హిట్టు అయ్యేది.