తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన మూవీ ప్రేమఖైదీ. హరీష్ హీరోగా నటించిన ఈ మూవీ అప్పట్లో అద్భుతమైన హిట్ సాధించింది. కేవలం తెలుగులోనే కాకుండా ఈ చిత్రం
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన మూవీ ప్రేమఖైదీ. హరీష్ హీరోగా నటించిన ఈ మూవీ అప్పట్లో అద్భుతమైన హిట్ సాధించింది. కేవలం తెలుగులోనే కాకుండా ఈ చిత్రం హిందీలో కూడా రిమేక్ అయింది. అలాంటి ఈ మూవీలో హరీష్ హీరోగా చేయగా ఆయనకు జంటగా కరిష్మా కపూర్ కథానాయకగా చేసింది. అలాంటి ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుందట. ఆ టైంలో హీరో హరీష్ కొంతసేపు అయితే చనిపోయేవారట. కానీ ఆయనను చావు నుంచి బయటపడేసింది కరిష్మా కపూర్. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది..
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నటువంటి కరిష్మా కపూర్ ఒక షోలో పాల్గొని అప్పటి విషయాలను మరోసారి గుర్తుచేసుకుంది. ప్రేమఖైదీ చిత్రం షూటింగ్ సమయంలో హీరో హరీష్ ప్రాణాలను కాపాడానని చెప్పింది. సినిమా షూటింగ్ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లో జరుగుతోందట. ఈ స్విమ్మింగ్ పూల్ దాదాపు పది అడుగుల లోతు ఉందట. వీరిద్దరూ 4 అడుగుల లోతుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలి. ఈ షూటింగ్ లో హీరోయిన్ హీరో నీటిలో మునిగిపోతుంటే కాపాడాలి. కానీ షూటింగ్ లో ఇది రివర్స్ అయిపోయింది. హీరో హీరోయిన్ ఇద్దరు సిమ్మింగ్ పూల్ లో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఇద్దరికీ ఈతరాదు.
ఇద్దరు నాలుగడుగుల లోతులోనే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఐదు దాటి ఆరడుగులు ఏడడుగుల లోతు దాకా వెళ్ళిపోయాం. దీంతో నేను రక్షించండి అని అరుస్తున్న.. కానీ హరీష్ నన్ను రక్షించండి నన్ను రక్షించండి అంటూ అరుస్తున్నాడు. ఆయన నాకంటే ఇంకాస్త లోతులోకి వెళ్లిపోయాడు. వెంటనే నేను కాస్త నా వైపు లాక్కున్నాను. అలా ఇద్దరం బయటకు వచ్చేసాం. హరీష్ బయటకు వచ్చిన తర్వాత నా ప్రాణాలు కాపాడావు అంటూ దండం పెట్టాడు. 1990లో రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన హిట్ సాధించింది.