ఈ క్యూట్ పాపను గుర్తుపట్టారా ఒకప్పుడు స్టార్.!

ఏ ఇండస్ట్రీ అయినా  నటీనటులు వస్తుంటారు పోతుంటారు.  ముఖ్యంగా హీరోలైతే స్టార్ డం పొందితే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. కానీ హీరోయిన్లు  అలా కాదు కొన్నాళ్లపాటు చేసిన తర్వాత


Published Sep 16, 2024 02:51:00 PM
postImages/2024-09-16/1726477185_NAINIKA.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఏ ఇండస్ట్రీ అయినా  నటీనటులు వస్తుంటారు పోతుంటారు.  ముఖ్యంగా హీరోలైతే స్టార్ డం పొందితే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. కానీ హీరోయిన్లు  అలా కాదు కొన్నాళ్లపాటు చేసిన తర్వాత వారు ఫెడౌట్ అవుతూ ఉంటారు.  చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, కాలం వరకు చాలామంది హీరోయిన్లు కొన్ని ఏళ్లపాటు ఇండస్ట్రీలో రాణించగలిగారు కానీ ప్రస్తుత కాలం హీరోయిన్లు మాత్రం మహా అయితే నాలుగైదు రాణించడమే కష్టంగా ఉంది.

అలాంటి ఈ తరుణంలో 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తూ తరగని అందంతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.  రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, వంటి హీరోయిన్లకు పోటీనిస్తూ ఇండస్ట్రీలో నిలబడగలిగింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే  అందాల సీనియర్ ముద్దుగుమ్మ మీనా.  అయితే ఈమె తన చిన్ననాటి ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా తన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన కొంతమంది మీనా చిన్నప్పుడు ఇంత క్యూట్ గా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

అయితే మీనా కెరియర్ పీక్స్ లో ఉండగానే 2009లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకు నైనిక అనే ఒక కుమార్తె కూడా పుట్టింది. ఆ తర్వాత కరోనా సమయంలో విద్యాసాగర్ కోవిడ్ వల్ల మరణించారు. అయితే తాజాగా వీరి ముద్దుల కూతురు నైనిక కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన పోలీసోడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.  అయితే మీనా కూడా ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ప్రస్తుతం తల్లి, వదిన, క్యారెక్టర్, ఆర్టిస్ట్ గా మంచి స్కోప్ ఉన్న కథల్లో నటిస్తూ వస్తోంది.

https://www.instagram.com/p/C_5J729ycMx/?igsh=MXFsbnIwaWl5aDJhNw==

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu meena nagarjuna vidya-sagar nainika

Related Articles