Thief Baba: వికారాబాద్‌లో అత్తిలి సత్తి రేంజ్ దొంగబాబా

గా డబ్బులు ఇవ్వకపోతే మీకు పాపం చుట్టుకుంటుందని బడితిస్తున్నాడని తెలిపారు. దీంతో కాలనీ వాసులు, మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 


Published Aug 24, 2024 03:50:10 PM
postImages/2024-08-24/1724494810_dongababa.jpg

న్యూస్ లైన్ డెస్క్: విక్రమార్కుడు సినిమాలో రవితేజ అత్తిలి సత్తి బాబాగా మారి అందరినీ మాయ చేస్తాడు. 'ఆమ్మో లచ్చిందేవి..లచ్చిందేవి..' అంటూ మాయమాటలు చెప్పి సగం గుండ్లు గీసేసి వెళ్లిపోతాడు. ఇక అటువంటి ఓ దొంగబాబానే తాజగా, వికారాబాద్ పట్టణంలో దర్శనం ఇచ్చాడు. గత వారం రోజులుగా తమ ఇళ్లలో దయ్యాలు, నరదృష్టి ఉందంటూ తమను దొంగబాబా భయాందోళనలకు గురిచేస్తున్నారని రాజీవ్ గృహకల్పాలో ఉండే వారు వాపోయారు.

మీ ఇంట్లో నరదృష్టి ఉంది దయ్యాలు ఉన్నాయి..మేము తాయత్తు ఇస్తాము.. దయ్యాన్ని మాయం చేస్తామంటూ ఒక్కో ఇంటికీ రూ.500, రూ.1000 డిమాండ్ చేస్తున్నాడని కాలనీ వాసులు తెలిపారు. పైగా డబ్బులు ఇవ్వకపోతే మీకు పాపం చుట్టుకుంటుందని బడితిస్తున్నాడని తెలిపారు. దీంతో కాలనీ వాసులు, మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 

అయితే, శనివారం కూడా ఇలాగే మాయమాటలు చెప్పి భయపెట్టేందుకు ప్రయత్నించిన దొంగబాబాకు కాలనీవాసులు దేహశుద్ది చేశారు. దొంగబాబాను పట్టుకొని పొట్టుపొట్టుగా కొట్టినట్లు తెలుస్తోంది. 

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu telanganam vikarabad thief-baba

Related Articles