2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో మేరీకోమ్ భర్త ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మేరీ కోమ్ పేరు తెలియని భారతీయుడు లేడు. బాక్సర్ మేరీకోమ్ తన 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నారు. మేరీ కోమ్ కపుల్ డివోర్స్ తీసుకుంటున్నట్లు చాలా జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఆమె భర్త ఓన్లర్ కరుంగ్ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో మేరీకోమ్ భర్త ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారనే వార్తలు ఇంతకు ముందే వచ్చాయి, ప్రస్తుతం మేరీకోమ్ తన నలుగురు పిల్లలతో కలిసి ఫరీదాబాద్ లో ఉన్నారు. తన హాస్బండ్ మాత్రం తన ఫ్యామిలీ తో ఢిల్లీలో ఉన్నారు.
అయితే మేరీకోమ్ మాత్రం తన బిజినెస్ పార్టనర్ హితేశ్ చౌదరీతో రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. మేరీకోమ్ ఫౌండేషన్ కు అతనే ఛైర్మన్ . ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వస్తున్న టైంలో మేరీకోమ్ హితేశ్ ఫొటోలను షేర్ చేస్తూ ఆ వార్తలకు మరింత ఊతం ఇచ్చారు. అయితే మేరీకోమ్ కాని ఆయన భర్త కాని విడాకులపై ఎలాంటి అనౌన్స్ మెంట్ చెయ్యలేదు.