Apple: ట్రంప్ టారిఫ్ లకు ..ఐఫోన్ సంస్థ షాకింగ్ నిర్ణయం ..5 విమానాల నిండా ఐఫోన్స్ !

ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తాయన్న ప్రకటన నేపథ్యంలో మార్చి నెలాఖరులో యాపిల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.


Published Apr 07, 2025 04:40:00 PM
postImages/2025-04-07/1744024270_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  టారిఫ్ ల నంుచి తప్పించుకునేందుకు యాపిల్ కంపెనీ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. భారత్ , చైనాలలో తయారైన ఐఫోన్లను విమానాల్లో అమెరికాకు చేరవేసింది. కేవలం మూడు రోజుల టైంలైన్ లో దాదాపు 5 విమానాల్లో ఐఫోన్స్ ను దిగుమతి చేసింది. అయితే ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. భార్త నుంచి మూడు విమానాలు , చైనా నుంచి రెండు విమానాలతో ఐదు విమానాల్లో ఐఫోన్లను పంపారు. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలులోకి వస్తాయన్న ప్రకటన నేపథ్యంలో మార్చి నెలాఖరులో యాపిల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.


ట్రంప్ వేసే పన్నుల పోటు ను తగ్గించుకోవడానికి భారత్ , చైనాలలోని తమ ఫ్యాక్టరీలలో తయారైన ఐఫోన్స్ అన్నింటిని వెంటనే అమెరికాకు చేరవేసింది. దీని వల్ల ఐఫోన్ల ధరలు మరింత  పెరిగే ఛాన్సులున్నాయి. స్థిరంగా ఉంచాలంటే ఇలా ముందే దిగుమతులు చెయ్యాలంటున్నారు ఆర్ధికనిపుణులు. అయితే ఐఫోన్ సంస్థ మాత్రం తేల్చి చెప్పేసింది. ట్రంప్ టారిఫ్ లే కాదు ఏం వచ్చినా ఇప్పట్లో అసలు ధరలు పెంచే అవకాశమే లేదని తెలిపింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu trump apple-phone

Related Articles