ఈ వేడుకలో ఫైనల్ ఇయర్ విద్యార్థిని వర్ష ఖరత్(20) మాట్లాడారు. కాలేజీతో అనుబంధాన్ని, లెక్చరర్లతో తమ సరదా సంఘటనలను గుర్తుచేసి తోటి విద్యార్థులను నవ్వించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మహారాష్ట్రలో ఓ కాలేజీలో జరిగిన విద్యార్ధుల వీడ్కోల సభలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్ధి కాలేజీ లో జరిగే ఫేర్వల్ పార్టీలో స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ గుండె పోటు తో చనిపోయింది. ఈ విషాదం మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలోని పరండా పట్టణంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ..తెలీదు..ఇలా సెకన్స్ లో కన్నవారి కలలను కూల్చేస్తుందంటూ పోస్టులు చేస్తున్నారు.
ఈ వేడుకలో ఫైనల్ ఇయర్ విద్యార్థిని వర్ష ఖరత్(20) మాట్లాడారు. కాలేజీతో అనుబంధాన్ని, లెక్చరర్లతో తమ సరదా సంఘటనలను గుర్తుచేసి తోటి విద్యార్థులను నవ్వించింది. తన జూనియర్స్ కు చాలా టిప్స్ ఇస్తూ వర్ష నవ్వుతూ ఒక్కసారిగా నేల కూలిపోయింది. వెంటనే స్పందించినా ఫలితం లేదు. ఎనిమిదేళ్ల వయసులో వర్షకు గుండె ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి గడిచిన పన్నెండు సంవత్సరాలలో వర్ష ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదు. హార్ట్ హెల్త్ చాలా హెల్దీగా ఉందని మందులు కూడా అక్కర్లేదని డాక్టర్లు తెలిపారు. అయినా ఇలా సడన్ గా చనిపోవడంపై కాలేజీ విద్యార్ధులు ..లెక్చలర్లు కన్నీరు మున్నీరయ్యారు. కాలేజీ తరుపున నివాళిగా సెలవు ప్రకటించారు.
At RG Shinde College in Dharashiv, Maharashtra, a student, Varsha Kharat, collapsed and died during her farewell speech
![]()
Tags : newslinetelugu student died