ఈ డ్రోన్ వాడడానికి చాలా రూల్స్ ఉన్నాయి. కాని తెలీక చాలా ఈజీగా వాడేస్తుంటారు. అసలు ఆ రూల్ ఏంటో చూద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ మధ్య కాలంలో డ్రోన్ల సంగతి అందరికి తెలిసింది. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ను కూడా కవర్ చేయగలుగుతున్నారు. పెళ్లి ఫొటోలు, యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు అన్నింటికి డ్రోన్ ను చాలా ఎక్కవ వాడుతున్నారు. అయితే ఈ డ్రోన్ వాడడానికి చాలా రూల్స్ ఉన్నాయి. కాని తెలీక చాలా ఈజీగా వాడేస్తుంటారు. అసలు ఆ రూల్ ఏంటో చూద్దాం.
* అనుమతి లేని ప్రదేశాల్లో డ్రోన్లు ఎగురవేయకూడదు.
* మిలటరీ ఏరియాల్లో , దేవాలయాల్లో డ్రోన్స్ ఎగురవేయరాదు.
*డ్రోన్స్ ఎగురవేయడానికి కంపల్సరీ లైసెన్స్ కావాల్సిందే.
* ఒక వ్యక్తి డ్రోన్ ను అక్రమంగా ఉపయోగిస్తూ పట్టుబడితే అతనికి జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.
*డ్రోన్ ను ఎగురవేయాలంటే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MOCA), డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)జారీ చేసిన డ్రోన్ రూల్స్ 2021 గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
* డ్రోన్ ఎంత చిన్నదైనా సరే ...ఎయిర్ క్రాప్ట్ చట్టం ప్రకారం పర్మిషన్ తీసుకోవల్సిందే.
* 1934 లోని నిబంధనల ప్రకారం లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
*.చిన్న డ్రోన్ల బరువు 2 నుంచి 25 కిలోల వరకు , మీడియం డ్రోన్ల బరువు 25 నుంచి 150 కిలోల వరకు, పెద్ద డ్రోన్ల బరువు 150 నుంచి 500 కిలోల వరకు ఉంటుంది. ఇలా ప్రతి వెయిట్ కు ఓ ప్రత్యేకమైన నియమాలుంటాయి. వీటిని ఫాలో అవుతూ మీరు స్కై ఫ్లాట్ ఫారం నుంచి సర్టిఫికేట్ తీసుకోవల్సిందే. డ్రోన్ కు ఈ రూల్స్ కంపల్సరీ .లేకుంటే శ్రీకృష్ణ జన్మస్థానమే.