జగిత్యాలలో తారక్ అనే యువకుడు బైపాస్ రోడ్డులోని ట్రిపుల్ ఆర్ వైన్స్‌లో మంగళవారం రాత్రి బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి చూడగా బీర్ బాటిల్‌లో చెత్త పాకురు ఉండడం గమనించిన యువకుడు షాక్ అయ్యాడు.
న్యూస్ లైన్ డెస్క్ : సంతోషం వచ్చినా, బాధ అయినా ఈ మధ్య చిన్నా పెద్దా తేడా లేకుండా సాయంత్రం వేళ సిట్టింగ్లు అంటూ తెగ తాగేస్తుంటారు. మంచినీళ్లు తాగినట్లే బాటిళ్లకు బాటిళ్లు లేపేస్తుంటారు. బీర్లు అంటే వారికి అంత ప్రేమ మరి. అయితే, అంతటి ఇష్టమైన బీర్ల కోసం బార్ల వద్ద బారులు తీరైనా, వైన్సుల వద్ద ముష్టి యుద్ధాలు చేసైనా సరే బాటిల్ దొరికే వరకు వెనక్కి తగ్గేదే లే అంటూ లైన్లలో వెయిట్ చేస్తుంటారు. అయితే, ఇంత కష్టపడి కొన్న బీర్‌లో నాణ్యత చూస్తే అంతంత మాత్రంగానే ఉంది.
అయితే అంత కష్టపడి కొనుక్కుని స్నేహితులతో కానీ తాగుదామని కూర్చుంటే చెత్తాచెదారం నిండి ఉండి ఉంటే పాపం ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో కదా..! సరిగ్గా ఇలాంటి సంఘటనే జగిత్యాల పట్టణంలో జరిగింది.
జగిత్యాలలో తారక్ అనే యువకుడు బైపాస్ రోడ్డులోని ట్రిపుల్ ఆర్ వైన్స్‌లో మంగళవారం రాత్రి బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి చూడగా బీర్ బాటిల్‌లో చెత్త పాకురు ఉండడం గమనించిన యువకుడు షాక్ అయ్యాడు.
బుధవారం ఉదయం బీర్ బాటిల్ తీసుకువచ్చి వైన్ షాప్ వెళ్లి ఆ బీర్ తాగి తన ప్రాణాలకు ఏమైనా అయితే ఎవరు బాద్యులు అని వైన్ షాప్ యజమానిని నిలదీశాడు.. ఆ బీర్ రిటర్న్ ఇవ్వగా వైన్ షాప్ యజమాని మరో బీర్ ఇచ్చి పంపారు. అయితే బీర్ బాటిల్‌లో చెత్త వస్తే తమకు సంబంధం లేదని ఆ బాటిల్ తిరిగి కంపెనీకి రిటర్న్ చేస్తామని వైన్స్ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన బీర్ బాటిల్ ఫోటో, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మద్యం ఆరోగ్యానికి హానికరం అని ప్రభుత్వాలు నెత్తీనోరు కొట్టుకుని చెప్తున్నారు. కానీ చెత్తాచెదారం ఉన్న బీర్ తాగి చచ్చిపోతే అని అంటున్న ఆ యువకుడు అసలు బీర్ ఆరోగ్యానికి మంచిది కాదని అనక పోవడం గమనార్హం. అయితే, మద్యం తయారీనే ప్రభుత్వం నిలిపివేవచ్చు కదా అనే అమలుకాని డిమాండ్ చేయకండి.