BigBoss 8 : తొలిరోజే పెట్టేశాడయ్యా పంచాయితీ.. పెద్ద ప్లానే..


Published Sep 02, 2024 03:30:14 AM
postImages/2024-09-02/1725265654_Day1shekharBhashavssoniaakula.jpg

న్యూస్ లైన్ డెస్క్ : అందరూ ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 మొదలైపోయింది. లాంచింగ్ ఈవెంట్ తో హౌజ్ లోకి ఉండే కంటెస్టెంట్లు ఎవరో క్లారిటీ ఇచ్చేశాడు బిగ్ బాస్. నిన్నటి ఆదివారం రోజున  బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున హౌజ్ మేట్స్ ను పరిచేస్తూ హౌజ్ లోకి పంపించేశారు. 14మంది కంటెస్టెంట్లలో యష్మీ గౌడ, నిఖిల్ మలియక్కల్, అభయ్ నవీన్, ప్రేరణ కంభం, సోనియా ఆకుల, బేజవాడ బేబక్క, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, శేఖర్ బాషా, పృథ్వీరాజ్, నాగ మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, అఫ్రిదీలు ఉన్నారు. అయితే.. లాంచింగ్ ఈవెంట్, కంటెస్టెంట్ల పరిచయం గ్రాండ్ గా చేసిన బిగ్ బాస్ తొలి రోజు నుంచే హైప్ ఇంకా ఇంట్రెస్ట్ పెంచేందుకు ప్లాన్ చేశాడు. హౌజ్ లో తొలిరోజు యాక్టివిటీకి సంబంధించిన ప్రోమోను విడుదల చేసి ఫస్ట్ ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. రెండోరోజుకు సంబంధించిన ప్రోమోలో నాగమణికంఠను బయటకు పంపేందుకు ట్రై చేశారు. ఆదిత్య ఓం, బేబక్క, విష్ణుప్రియ, నేనిక, సోనియా కలిసి నాగ మణికంఠను బయటకు పంపాలని ఓట్లు వేయడంతో మణికంట కాస్త ఎమోషనల్ అయ్యాడు.

తర్వాత హౌజ్ మేట్స్ అందరూ కలిసి బిగ్ బాస్ హౌజ్ లో ఆడిపాడారు. ఈ క్రమంలోనే కొంతమంది హౌజ్ మేట్స్ అక్కడ తినేందుకు పెట్టిన ఆరెంజ్ ఫ్రూట్స్ తో బంతాట ఆడారు. దానికి సోనియా ఆకుల అభ్యంతరం చెప్పింది. తినే వాటితో ఆటలాడొద్దు. ఎవరూ కూడా ఆరెంజెస్ ముట్టుకోవద్దు అంటూ మందలించే ప్రయత్నం చేసింది. దీనికి మిగతా వారంతా సైలెంట్ గానే ఉన్నా.. శేఖర్ బాషా మాత్రం రెచ్చిపోయాడు. బిగ్ బాస్ లో ఆరెంజెస్ తో ఆడుకోవద్దని రూల్ ఉందా? అంటూ మాట్లాడాడు. దీనికి సోనియా కూడా గట్టిగానే కౌంటర్ వేసింది. నీకు ఇచ్చిన వాటితో ఆడుకో.. అవసరమైతే కిందేసి తొక్కి.. డ్రైనేజీలో వేసి మళ్లీ తీసుకొని తిను. కానీ వేరే వాళ్లకు వాటిని ఇవ్వకు. మనుషుల్లాగ తినాలనుకునే వారికి అవి పెట్టకు అంటూ గట్టిగానే ఇచ్చి పడేసింది. దీంతో.. శేఖర్ బాషా అదే ఆరెంజ్ ఫ్రూట్ ని తింటూ.. ఇప్పుడు నేను దీంతో ఆడుకున్నా. ఇప్పుడు దీన్నే తిన్నా. నేను మనిషిని కాదా? అంటూ అడ్డదిడ్డంగా వాదించాడు. సరిగ్గా ఈ గొడవ జరుగుతున్నప్పుడే బిగ్ బాస్ కల్పించుకొని హౌజ్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చాడు.  ఆ టాస్క్ లో గెలిచిన దాన్ని బట్టి ఇంట్లో ఉన్నవారికి రేషన్ ఇవ్వడం జరుగుతుందని ప్రకటించాడు. ఇక ఆ టాస్క్ ఏంటో.. సోనియా.. శేఖర్ బాషాల మధ్య లొల్లి ఏందాక పోయిందో తెలియాలంటే ఈరోజు టెలికాస్ట్ అయ్యే తొలి ఎపిసోడ్ చూడాల్సిందే.

newsline-whatsapp-channel
Tags : viral viral-news nagarjuna big-boss big-boos8 latest-news bigboss--buzz-host

Related Articles