2006 లో ఈయనకు పద్మభూషణ్ పురస్కారం అందింది. అలాగే అదే ఏడాది నవంబర్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందించారు. అయితే ఈ పురస్కారాలను ఆయన చారిటబుల్ ట్రస్టుల ద్వారా
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీలోకి సాధారణ వ్యక్తిగా అడుగు పెట్టినటువంటి చిరంజీవి ఎంతో కష్టపడి నెంబర్ వన్ స్థానానికి ఎదిగారు. ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి రావడానికి చాలా శ్రమించారని చెప్పవచ్చు. జీవిత ప్రయాణంలో ఆయనకు ఎన్నో అవమానాలు, చిత్కారాలు కూడా ఎదురయ్యాయి. వీటన్నింటినీ దిగమింగుకొని ఒక్కో మెట్టు పైకెక్కుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. చివరికి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా మారారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని సినిమాలు, లాభా నష్టాలు గురించి కొన్ని వివరాలు చూద్దాం..
పునాదిరాళ్ల నుంచి మొదలు:
చెన్నైలోని ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లమా పొందినటువంటి చిరంజీవి తొలిసారి 1978వ పునాదిరాళ్లు చిత్రంలో నటించారు. కానీ ఈ సినిమా రిలీజ్ కి లేట్ అయింది. ఆ తర్వాత నటించిన ప్రాణం ఖరీదు ముందుగా రిలీజ్ అయి మొదటి సినిమానే దారుణంగా ఫ్లాప్ అయింది. ఇందులో ఆయన మేకప్ లేకుండా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ మూవీ తర్వాత బాపు డైరెక్షన్ లో వచ్చిన "మన ఊరి పాండవులు" లో ఒక చిన్న పాత్రలో నటించాడు చిరంజీవి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన పాత్రకు గుర్తింపు లభించింది.
ఆ తర్వాత వరుసగా ఖైదీ, ఛాలెంజ్, శుభలేఖ, అడవి దొంగ, పసివాడి ప్రాణం, దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి, ముఠామేస్త్రి, అల్లుడా మజాకా, ముగ్గురు మొనగాళ్లు, స్వయంకృషి, రుద్రవీణ, ఘరానా మొగుడు, వేట, కొండవీటి దొంగ, హిట్లర్, ఇలా ఎన్నో భిన్నమైన చిత్రాల్లో నటించి అభిమానుల మదిలో గుడి కట్టుకున్నారు. అంతేకాకుండా ఠాగూర్, స్టాలిన్, శంకర్ దాదా ఎంబిబిఎస్, ఇంద్ర, బావ గారు బాగున్నారా వంటి మాస్ సినిమాల్లో కూడా నటించి తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. మళ్లీ 2017లో ఖైదీ నెంబర్ 150తో బాస్ ఇస్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బారీ హీట్ అయింది. దీని తర్వాత సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం విశ్వంభరతో మరోసారి తన సత్తా ఏంటో చూపించడానికి రెడీ అయ్యారు చిరు.
సుప్రీం నుంచి మెగాస్టార్ :
చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. సుప్రీం హీరోగా ఎంతో గుర్తింపు పొందిన చిరంజీవి 1988లో రిలీజ్ అయిన 'మరణ మృదంగం' సినిమాతో మెగాస్టార్ అయ్యారు. అయితే ఈ సినిమా నుంచి టైటిల్స్ లో మెగాస్టార్ అని వెండితెరపై కనిపిస్తూ వస్తుంది. ఈ సినిమాకు ముందు టైటిల్స్ లో సుప్రీం హీరో అని ఉండేది. ఈ బిరుదు ఖైదీ సినిమా వరకు కొనసాగింది. ఇక మరణ మృదంగం నుంచే మెగాస్టార్ అనే ట్యాగ్ లైన్ వచ్చింది.
అవార్డులు:
2006 లో ఈయనకు పద్మభూషణ్ పురస్కారం అందింది. అలాగే అదే ఏడాది నవంబర్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందించారు. అయితే ఈ పురస్కారాలను ఆయన చారిటబుల్ ట్రస్టుల ద్వారా చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఇచ్చారు. అంతేకాకుండా చిరంజీవికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. ఇలా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదిగి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవికి న్యూస్ లైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.