తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేంజర్ రిలీజ్ కు రెడీ గా ఉంది. సంక్రాంతి రిలీజ్ కావడంతో ప్రమోషన్స్ కూడా గట్టిగా జరుగుతున్నాయి. నిన్ననే డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. కియారా అద్వాని కథనాయికగా నటిస్తున్న ఈ సినిా పై శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దీనిలో భాగంగా చిత్ర యూనిట్ ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది. వరుసగా పాటలను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఒక పాట రిలీజ్ అయ్యింది. జరగండి జరగండి సాంగ్ జనాల్లో బాగా వెళ్తుంది. రా మచ్చా మచ్చా, నానా హైరానా సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రంలో నుంచి నాలుగో పాట దోప్ ను విడుదల చేసారు మూవీ టీం. రామ్ చరణ్, కియారా అద్వానీ డ్యాన్స్ అదిరిపోయాయి. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. థమన్, రోషిని పాడారు. జానీ మాస్టర్ కంపోజ్ చేశారు. యూట్యూబ్ లో ప్రస్తుతం ఈ పాట దూసుకుపోతోంది.