Charan: 'గేమ్ ఛేంజర్' నుంచి మరో సాంగ్‌ రిలీజ్!

భారీ బ‌డ్జెట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'. అనేక అంచ‌నాలతో.. త‌మిళ‌ .. హిందీ భాష‌ల్లో వచ్చే సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌వుతుంది.


Published Nov 28, 2024 09:26:00 PM
postImages/2024-11-28/1732809594_hq720.jpg

న్యూస్ లైన్, స్పెషల్  డెస్క్: గేమ్ ఛేంజర్ నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ టీం. భారీ బ‌డ్జెట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'. అనేక అంచ‌నాలతో.. త‌మిళ‌ .. హిందీ భాష‌ల్లో వచ్చే సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌వుతుంది. చరణ్ , కియారా జోడీ తో డైరక్టర్ శంకర్ మంచి స్టోరీ బిల్డ్ చేశారట. వీరిద్దరి కెమిస్ట్రీ అధ్భుతంగా ఉంటుందని అంటున్నారు. 


ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ విడుద‌లైంది. తెలుగులో ‘నా నా హైరానా’.. హిందీలో ‘జానా హైరాన్ సా’.. త‌మిళంలో ‘లై రానా’ అంటూ మెలోడీ ఆఫ్ ది ఇయ‌ర్‌గా ఈ పాట అధ్బుతంగా ఉంది. ఈ పాట‌ను తెలుగులో రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాయ‌గా, త‌మిళంలో వివేక్‌, హిందీలో కౌశ‌ర్ మునీర్ రాశారు. ఈ పాట కూడా మంచి వైరల్ అవుతుందంటున్నారు చరణ్ ఫ్యాన్స్.


అయితే శంకర్ ఈ పాటను 'రెడ్ ఇన్‌ఫ్రా' కెమెరాతో చిత్రీక‌రించారు. ఒక్కో స‌న్నివేశం ఒక్కో పెయింటింగ్‌లా విజువ‌ల్ బ్యూటీతో వస్తుంది. మరో  శంకర్ మ్యాజిక్ చేసి తీరుతాడని అంటున్నారు . మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నుకునేంత గొప్ప‌గా పాట‌లోని ప్ర‌తీ ఫ్రేమ్ ఉంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఈ పాట‌ను ఫ్యూజ‌న్ మెలోడీగా ట్యూన్ చేశారు. ఈ పాట శ్రేయా ఘోషల్ , కార్తీక్  పాడారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ అధ్భుతంగా ఉంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shankar-director game-changer

Related Articles