Telangana:గాంధీ కౌశిక్ రెడ్డి రచ్చ..ఆ బడా నేత హస్తముందా.?

రాష్ట్రంలో శాంతిభద్రతల అంశం, పోలీసుల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారాయి. డిపార్ట్ మెంట్ పూర్తిస్థాయిలో అధికారిపార్టీకి వంతపాడుతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో వరుసగా


Published Sep 18, 2024 07:20:50 AM
postImages/2024-09-18/1726624250_gandhi.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో శాంతిభద్రతల అంశం, పోలీసుల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారాయి. డిపార్ట్ మెంట్ పూర్తిస్థాయిలో అధికారిపార్టీకి వంతపాడుతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంఘటనలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయట. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడంతో ఈ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. వాస్తవానికి ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఇరువర్గాలను పోలీసులు పూర్తిగా కట్టడి చేస్తారు. ఎవరిని కూడా ఇళ్లలోంచి బయటకు రానివ్వరు. కానీ.. కౌశిక్ రెడ్డిని గృహనిర్బంధం చేసి.. గాంధీని ఫ్రీ వదిలేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

 గత మూడు, నాలుగు రోజులుగా అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు 
నడుస్తున్నాయి. ఈ సమయంలో అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. అటు అరికెపూడి కూడా తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే అతని ఇంటికి వెళ్తానని సవాల్ చేశారు. అయితే పోలీసులు మాత్రం పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఆయన్ను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అటు వైపు ఉన్న అరికెపూడి గాంధీని పోలీసులు అడ్డుకోకపోవడంపైనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

 అరికెపూడి గాంధీ కూడా సవాల్ చేసినా ఆయనను మాత్రం పోలీసులు ఆపలేదు. ఆయన ఇంటి దగ్గర పోలీసులను మోహరించలేదు. దీంతో తన నివాసం నుంచి పోలీస్ ఎస్కార్ట్ తో భారీ కాన్వాయ్ తో కొండాపూర్ లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు గాంధీ. పెద్ద సంఖ్యలో తన అనుచరులను వెంటేసుకెళ్లారు. అప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటిదగ్గర పోలీసులు ఉన్నా.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. అందుకే వారంతా ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లి.. కౌశిక్ రెడ్డి ఇంటి వరకు చేరుకున్నారని అంటున్నారు. ఒకవేళ పోలీసులకు అడ్డుకునే ఉద్దేశం ఉంటే.. మెయిన్ గేట్ క్లోజ్ చేస్తే.. ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించే అవకాశమే ఉండకపోయేదంటున్నారు. ఈ ఇష్యుపై  మాజీ మంత్రి హరీష్ రావు కూడా  సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వంలో ఉన్న కొందరు కీలక వ్యక్తుల నుంచి పోలీసులకు అందిన ఆదేశాల మేరకే దాడి జరిగిందన్నారు.

కావాలనే దాడిని అడ్డుకోలేదని, అరికెపూడి గాంధీ.. భారీ కాన్వాయ్ తో కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చే వరకు సైలెంట్ గా ఉండిపోయారని ఆరోపించారు. హరీష్ రావు చేసిన ఆరోపణలు నిజమేనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఎందుకంటే అరికెపూడి గాంధీ ఉండే శేరిలింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు ర్యాలీగా వెళ్తుంటే ఎక్కడ కూడా పోలీసులు అడ్డుకోలేదు. రెండు పోలీస్ స్టేషన్లు దాటుకుంటూ వెళ్లినా ఎక్కడా అడ్డగించలేదు. అంటే.. కావాలనే ఆయనకు రూట్ క్లియర్ చేశారని అంటున్నారు. ఏ చిన్న సంఘటన జరగబోతోందని తెలిసినా.. ఇంటలిజెన్స్ వర్గాలు ఉప్పందిస్తాయి. కానీ అరికెపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తారని.. ఇంటిలిజెన్స్ ఎందుకు  అలర్ట్ చేయలేకపోయిందనే చర్చ నడుస్తోంది. అయితే ఇంటలిజెన్స్ సమాచారం వచ్చాకే..

మరింతగా రెచ్చిపొమ్మని కొందరు పెద్దలు స్వయంగా ఫోన్ చేసి గాంధీతో మాట్లాడినట్టుగా చెబుతున్నారు. అందుకే మొదట సైలెంట్ గా ఉన్న గాంధీ.. కాసేపటికే స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు, వారి మిత్రుడు స్వయంగా అరికెపూడి గాంధీకి, ఫోన్ చేసి మాట్లాడారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అటు పోలీసులకు కూడా వారి నుంచి ఆదేశాలు వెళ్లాయని.. అందుకే కాన్వాయ్ కి రూట్ క్లియర్ చేశారని, రాళ్లు, కోడిగుడ్లు, టమోటాలతో దాడి జరుగుతోంటే ప్రేక్షకపాత్ర వహించారనే చర్చ నడుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu congress padi-koushik-reddy huzurabad brs- arikepudi-gandhi sherlingam-pally

Related Articles