రాజకీయాలు పక్కనపెట్టి మిడ్ మానేరు నుంచి వెంటనే సాగునీటి కోసం నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు లేఖతో కదలిన ప్రభుత్వ యంత్రాంగం సోమవారం మిడ్ మానేరు నుంచి నీటి తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. దీంతో గోదావరి జలాలు రంగనాయక సాగర్ లోకి చేరాయి.
న్యూస్ లైన్, హైదరాబాద్: గోదావరి జలాలు రంగనాయక్ సాగర్ లోకి చేరాయి. సోమవారం మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేశారు. అక్కడి నుంచి రంగనాయక సాగర్ లోకి నీళ్లు విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం గోదావరి జలాలు రంగనాయక్ సాగర్‌లోకి చేరాయి. ఇక్కడి నుంచి మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్‌కు నీళ్లు తరలించనున్నారు.
సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లు నీళ్లు లేక అడుగంటిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. రాజకీయాలు పక్కనపెట్టి మిడ్ మానేరు నుంచి వెంటనే సాగునీటి కోసం నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు లేఖతో కదలిన ప్రభుత్వ యంత్రాంగం సోమవారం మిడ్ మానేరు నుంచి నీటి తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. దీంతో గోదావరి జలాలు రంగనాయక సాగర్ లోకి చేరాయి. నిన్నమొన్నటి వరకు నీళ్లు లేక అల్లాడిన రైతాంగం ఇప్పుడు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.