పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బిడ్డ అథ్లెట్ దీప్తి జీవాంజిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో అభినందించారు.
న్యూస్ లైన్ డెస్క్: పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బిడ్డ అథ్లెట్ దీప్తి జీవాంజిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో అభినందించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం, ఆమె కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్‌కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పారాలింపిక్స్ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు కోటి రూపాయాల నజరానా ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పారిస్ పారాలింపిక్ మహిళల 400 మీటర్ల టీ20 పరుగు పందెంలో 55.82 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించి తొలి తెలుగు క్రీడాకారిణిగా దీప్తి చరిత్ర సృష్టించింది. ఇక ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించి పెట్టిన దీప్తి జీవాంజికి వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.