గతంలో కోచ్ గా చేయకపోయినా సూర్యకుమార్ యాదవ్ తో పాటు యువ జట్టుతో అనుకున్నది సాధించాడు గంభీర్ సాబ్.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలే గంభీర్ అన్నకు ముక్కు మీద కోపం ...ఎవడైనా చిర్ర మర్ర మాట్లాడితే ముక్కు పగలగొట్టే వస్తాడు...ఇది క్రికెట్ చూసే జనాలందరికి తెలుసు.. ఇటా ..ఇప్పుడున్న స్టార్ క్రికెటర్లు ...డబ్బున్నవాళ్లు ...అంతకు మించి టాలెంట్ ఉన్నోళ్లు ...ఎవరి మీద జులుం చేసినా ఎవ్వరు ఊరుకోరు . గౌతమ్ గంభీర్ భారత్, శ్రీలంక వన్డే, టీ20 సిరీస్‌లకు ప్రధాన కోచ్ గా బోనీ కొట్టేశారు . గతంలో కోచ్ గా చేయకపోయినా సూర్యకుమార్ యాదవ్ తో పాటు యువ జట్టుతో అనుకున్నది సాధించాడు గంభీర్ సాబ్.
బోనీ బాగుంది కాని ... వన్డే సిరీస్ రూపంలో గంభీర్ కు గట్టి సవాల్ ఎదురయ్యింది. శ్రీలంక టీం గురించి పక్కన పెడితే మన ఆటగాళ్లు ....రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి అన్ని ఫార్మాట్ ఆటగాళ్లను ఎలా ఓ దారికి తీసుకువస్తాడనేది మెయిన్ క్వశ్చన్. అసలే టాప్ ప్లేయర్లు...వన్డే లకి , టీ 20 లకి ప్రాతినిద్యం వహించిన వారు. వీరందరిని గంభీర్ ఎలా లైన్ లో పెట్టుకుంటారనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ .
రాహుల్ ద్రవిడ్ కు కూడా ఇదే సమస్య...తను క్రికెట్ ఆడుతున్నప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేశాయి. ఇప్పుడు క్రికెటర్లు డబ్బులున్నవాళ్లు ..హోదా ఉన్నవాళ్లు అంతకు మించి దూకుడు మీదుంటారు. డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ గంభీర్ కు అలవాటవ్వడం కష్టమే. అవసరమైతే ప్రతి ప్లేయర్ కు పర్సనల్ గా రిక్వస్ట్లు..బుజ్జగింపులు చెయ్యాల్సిందే . అప్పుడు కాని గంభీర్ దారికి వారు రారు. టీ 20 వరల్డ్ కప్ 2007 , వన్డే వరల్డ్ కప్ 2011 గెలిచిన టీం ..లో సభ్యుడే ఈ గంభీర్. ఇన్నాళ్లు క్రికెట్ కమెంటర్ గా చేసిన ఆయన ఇప్పుడు కోచ్ గా రాణిస్తాడా అనేదే పెద్ద సమస్య.