నా గుండె కొల్లగొట్టినాదిరో అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ ను ఒకేసారి ఐదు భాషల్లో రిలీజ్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ చేయగా ఫిబ్రవరి 24 రెండో పాట కొల్లగొట్టినాదిరో అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. కొల్లగొట్టినాదిరో.. నా గుండె కొల్లగొట్టినాదిరో అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ ను ఒకేసారి ఐదు భాషల్లో రిలీజ్ చేశారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి అందించిన బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఈ పాటను పాడారు. ఫుల్ మాస్ బీట్ తో వచ్చిన ఈ సాంగ్ ఇప్పటికే ఫుల్ వైరల్ అవుతుంది.
ఇప్పటికే ఫస్ట్ సింగిల్ పాట రిలీజ్ అయ్యింది. ఈ పాటను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు. ఈ చిత్రంలో పవన్‌కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. వపన్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ , నర్గీస్ ఫక్రీ , నోరా ఫతేహి లాంటి బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే క్రిష్ సినిమాకు సగానికి పైగా దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ పొలిటికల్ ప్రెజర్ వల్ల సినిమా వాయిదా పడుతుందా...లేకపోతే వాయిదా పడుతుంది.