రేవంత్ రెడ్డి బాధ్యతగా వ్యవహరించాలని హరీష్ రావు సూచించారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులందరికి రుణమాపీ అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెల కావొస్తోందని తెలిపారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలబెట్టుకోవాలని సూచించారు.
న్యూస్ లైన్ డెస్క్: పంట పండించే రైతన్న ప్రాణం కోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసిందని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన రైతు సురేందర్ రెడ్డి(52) అనే రైతు రుణమాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీసులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన హరీష్ రావు రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ట్వీట్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని ఆయన వెల్లడించారు. రుణమాఫీ కాదేమోననే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బాధ్యతగా వ్యవహరించాలని హరీష్ రావు సూచించారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులందరికి రుణమాపీ అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెల కావొస్తోందని తెలిపారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలబెట్టుకోవాలని సూచించారు.
ధైర్యం కోల్పోవద్దని హరీష్ రావు రైతులకు సూచించారు. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. BRS ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ నాయకత్వంలో రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.
కాగా, గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉన్న సురేందర్ రెడ్డి మృతదేహానికి BRS నేతలు హరీష్ రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి నివాలులర్పించారు. రైతు కుటుంసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు.