Kalki: కల్కితో ప్రభాస్ పేరే మారిందా.? యంగ్ రెబల్ స్టార్ కాదు.. ఏంటంటే.? 2024-06-27 06:26:25

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ, వార్తల్లో కానీ ఎక్కడ చూసినా కల్కి, కల్కి, కల్కి ఈ పేరే   ట్రేండింగ్ లో ఉంది. అలాంటి కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీన రిలీజ్ అయింది. ఇప్పటికే థియేటర్లలో ప్రీమియర్ షోలు ముగిశాయి. ఇదే తరుణంలో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు అద్భుతమైన సినిమా అంటూ ట్విట్టర్ రివ్యూ ఇచ్చారు. అలాంటి ఈ చిత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరును  ఒక్కసారిగా మార్చేస్తోంది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ కు యంగ్ రెబల్ స్టార్ అనే పేరు కాకుండా, మరో పేరు రాబోతోందని తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.

గ్రేట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ కల్కి 2898 ఏడి. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లోకి వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఇందులో నటీనటుల విషయానికి వస్తే గ్రేట్ నటులు అమితాబ్ బచ్చన్, కమలహాసన్,  రాజమౌళి,విజయ్ దేవరకొండ, మృనాల్ ఠాకూర్,  దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, రాంగోపాల్ వర్మ, ఇలా ఎంతో పేరు పొందిన సెలబ్రిటీలు నటించారు. దీంతో ఈ చిత్రంపై అభిమానులు కూడా అనేక అంచనాలు పెట్టుకున్నారు.  వారి అంచనాలకు తగ్గట్టుగానే సినిమా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా చూస్తుంటే వేరే ప్రపంచంలోకి మనం వెళ్ళినట్టు అనిపిస్తోంది.

 ఇక సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి.  మొత్తానికి ఈ సినిమా అభిమానులకు గుస్ బంప్స్ తెప్పిస్తోందని చెప్పవచ్చు. అలాంటి ప్రభాస్ పేరు ఈ చిత్రం ద్వారా మారబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ అని పేరు ఉన్నది. అయితే ఆయన పాత సినిమాల్లో ఎక్కడ చూసినా  సినిమా పేర్లు పడే టైంలో యంగ్ రెబల్ స్టార్ అని టైటిల్స్ చూపించేవారు. కానీ కల్కి సినిమాలో మాత్రం ఆ పేరు కాకుండా "శ్రీ" ప్రభాస్ అని చూపించారు. ఇకనుంచి యంగ్ రెబల్ స్టార్ కాకుండా శ్రీ ప్రభాస్ అని పిలుస్తారన్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి ప్రభాస్ కు ఏదైనా  జాతక దోషాల వల్ల శ్రీ ప్రభాస్ అని పెట్టారా, లేదంటే కావాలనే పెట్టారా అనేది ముందు ముందు తెలుస్తుంది.