Kalyan Ram: కూతురు కొడుకును చూశారా ఇప్పుడు చూస్తే షాకే.?

నందమూరి ఫ్యామిలీ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి అన్న ఎన్టీఆర్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో 


Published Oct 06, 2024 05:30:00 PM
postImages/2024-10-06/1728212429_krfaily.jpg

న్యూస్ లైన్ డెస్క్: నందమూరి ఫ్యామిలీ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి అన్న ఎన్టీఆర్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగారు. ఇక వీళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్న ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ తారకరత్న కొద్ది రోజుల్లోనే ఫెయిడౌట్ అయిపోయారు. ఇక కళ్యాణ్ రామ్ కొన్నాళ్లపాటు ఊపు ఊపిన ఆ మధ్య మళ్ళీ డల్ అయిపోయారు.

జూనియర్ ఎన్టీఆర్ అయితే  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు దేవరాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇక ఆయన అవ్వడమే కాకుండా తన అన్న కళ్యాణ్ రామ్ కు కూడా బూస్టింగ్ ఇస్తూ ఇండస్ట్రీలో రాణించేలా చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమా ద్వారా కంబ్యాక్ అయ్యారు. ఓ  వైపు సినిమాలు చేస్తూ మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. అయితే తాజాగా దేవర సినిమాకు నిర్మాతగా చేసి అద్భుతమైన హిట్ అందుకున్నారు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్  ఎప్పుడు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో కనిపిస్తూనే ఉంటారు.

అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ అభయ్ రామ్, భార్గవ్ రామ్,  లక్ష్మీ ప్రణతి కూడా సోషల్ మీడియా కంట పడుతూనే ఉంటారు. కానీ కళ్యాణ్ రామ్  ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో కనిపించింది లేదు.  ఎప్పుడో వీరి ఫ్యామిలీకి వారి పిల్లలు చిన్నతనంలో చూశారు. అలాంటి కళ్యాణ్ రామ్ కూతురు కొడుకు ప్రస్తుతం పెద్దవారైపోయారు.

అయితే తాజాగా కళ్యాణ్ రామ్ తన ఫ్యామిలీతో కలిసి వేకేశన్స్ వెళ్లి వస్తున్న సమయంలో తన భార్య స్వాతి కొడుకు సూర్యారాం, కూతురు తారక అద్వైత మీడియా కంట పడ్డారు. చాలా కాలం తర్వాత వీరి ఫ్యామిలీ బయట కనిపించడంతో అందరూ చూసి షాక్ అయిపోతున్నారు.  తన శౌర్యరామ్ హీరో రేంజ్ లో ఉన్నారని, నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు కూడా వారు ఎలా ఉన్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి.

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr balakrishna kalyan-ram nandamuri-family

Related Articles