తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి స్థాయికి ఎదిగారో మనందరికీ తెలుసు. ఎంతో కష్టపడి తెలుగు ఇండస్ట్రీలో రాణించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తర్వాత పాన్ ఇండియా
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి స్థాయికి ఎదిగారో మనందరికీ తెలుసు. ఎంతో కష్టపడి తెలుగు ఇండస్ట్రీలో రాణించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో నటించిన ఎన్టీఆర్ దేవర చిత్రం ద్వారా తనంటే ఏంటో నిరూపించుకున్నాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా లాస్ ఏంజెలిస్ వెళ్ళినా ఆయన వారసుల గురించి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మీ వారసులైన అబయ్ భార్గవ్ లను ఇండస్ట్రీలోకి తీసుకువస్తారా అనే ప్రశ్నకు ఆయన క్లియర్ గా సమాధానం ఇచ్చారు. నా కుమారులు ఇద్దరి ఆలోచన విధానంలో చాలా వ్యత్యాసం ఉందని, వారి ఇష్ట ఇష్టాలను అభిప్రాయాలను నేను గౌరవిస్తానని, వారికి ఏది ఇష్టమైతే అదే చేయడానికి నేను ప్రోత్సహిస్తానని, నా ఇష్టాలను వారిపై అస్సలు రుద్దనని అన్నారు. ఈ రోజుల్లో పిల్లలు వారి సొంత ఆలోచనలే కలిగి ఉండాలని, వారు ఏ రంగం వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ రంగంలో ప్రోత్సహించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని అన్నారు. చాలామంది తల్లిదండ్రులు ఇది చేయి అది చేయి అంటు పిల్లలపై చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. అలాకాకుండా వారికి ఏది ఇష్టమో అది మాత్రమే చేయించి వారు ఆ రంగంలో రాణించేలా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.
మొత్తానికి ఎన్టీఆర్ పిల్లలు ఇండస్ట్రీలోకి రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. అంతేకాదు దేవర పార్ట్2 ఎప్పుడు మొదలవుతుందని దానిపై కూడా ఆయన స్పందించారు. దేవర మొదటి భాగం చిత్రీకరణ టైంలోనే పార్ట్ 2సన్నివేశాలు కూడా పూర్తి చేసామని అన్నారు. మొదటి భాగం హిట్ సాధించింది ఇప్పుడు రెండో భాగంపై మా బాధ్యత ఎంతో ఉందని అన్నారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత రెండవ పార్ట్ షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు.