నవ్వుతో ఇన్ని లాభాలా.. రోజు 30ని"నవ్వండి ఆరోగ్యంగా ఉండండి.!

ప్రస్తుత కాలంలో చాలా మంది బిజీ లైఫ్ రిత్యా నవ్వడం అనేది మర్చిపోయారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. నవ్వు నాలుగు విధాల చేటు కాదు, నవ్వు 40 విధాల మంచి అనే పరిస్థితిని మనం


Published Oct 06, 2024 07:13:34 PM
postImages/2024-10-06/1728222214_laughting.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలా మంది బిజీ లైఫ్ రిత్యా నవ్వడం అనేది మర్చిపోయారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. నవ్వు నాలుగు విధాల చేటు కాదు, నవ్వు 40 విధాల మంచి అనే పరిస్థితిని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా నవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 నొప్పులు దూరం:
 ముఖ్యంగా నవ్వడం వల్ల ఎండార్పిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందట. దీనివల్ల నొప్పులు తగ్గి ఉపశమనం కలుగుతుందట.

 రోగనిరోధక శక్తి:
 మనం నవ్వినప్పుడు శరీరంలో కలిగే అనుభూతి  మీ మెదడులో రసాయన ప్రతి చర్యను ప్రేరేపిస్తుందట. ఇది న్యూరో వెబ్సైట్స్ అని పిలవబడే చిన్న ప్రోటీన్ విడుదల చేసి దీని కారణంగా  ఇమ్యూనిటీ పెరుగుతుందట.

 బీపీ కంట్రోల్ :
 నవ్వడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపరడమే కాకుండా, రక్తపోటు కంట్రోల్ అవుతుందట. దీనివల్ల  వీటితో బాధపడేవారు  ప్రతిరోజు ఒక అర్ధగంట నవ్వడానికి కేటాయిస్తే  బీపీ కంట్రోల్ అవ్వడమే కాకుండా కండరాల రిలాక్స్ అవుతాయట.

 పాజిటివ్ ఎనర్జీ:
 ఎక్కువగా నవ్వడం వల్ల పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందట. నవ్వడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చి మీ జీవితం సుఖమయం అవుతుందని అంటున్నారు నిపుణులు.
 
 ఆనందం:
 మనం పొద్దున లేవగానే నవ్వుతూ జీవితాన్ని ప్రారంభిస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటామట. నవ్వు అనేది మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తుందని  వైద్య నిపుణులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news health-benifits happy-life happy-sleep

Related Articles