టాలీవుడ్ యాక్షన్ హీరోల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు గోపీచంద్. విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన హీరో కాకముందు జయం సినిమాలో
న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ యాక్షన్ హీరోల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు గోపీచంద్. విలన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన హీరో కాకముందు జయం సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక హీరోగా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి ఆయన విలన్ పాత్రలో ఇక చేయలేదు.. అలాంటి గోపీచంద్ ప్రస్తుతం "విశ్వం" సినిమాలో నటించి ఆ సినిమా ప్రమోషన్స్ లో బాగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా యాంకర్లు ఆయనను ఆసక్తికరమైనటువంటి క్వశ్చన్ వేశారు.
మళ్లీ విలన్ పాత్రలో నటిస్తారా ఛాన్స్ వస్తే ఎవరితో నటిస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు గోపీచంద్ క్లియర్ కట్ గా సమాధానం ఇచ్చారు. నేను విలన్ గా చేసినటువంటి మూడు చిత్రాలు నా కెరియర్ పై ఎంతో ఇంపాక్ట్ చూపించాయి. ముఖ్యంగా వర్షం, జయం చిత్రంలో నా విలన్ పాత్ర అందరిని ఆకట్టుకుంది. దీంతో నన్ను చాలామంది విలన్ పాత్రలు చేయమని అడుగుతున్నారు. కానీ నాకు వాటిపై అంతగా ఇంట్రెస్ట్ లేదు.
కానీ ఆ ఒక్క హీరోతో మాత్రం విలన్ పాత్ర ఛాన్స్ వస్తే చేస్తా, ఆయనే ప్రభాస్ అని చెప్పుకొచ్చారు. చాలా గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో విశ్వం సినిమాలో చేశారు.. ప్రస్తుతం ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి ఇది గోపీచంద్ కెరీర్ ను నిలబెడుతుందా లేదంటే బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడుతుందా అనేది చూడాలి..