Tirupati: శ్రీవారి ఆలయంపై హెలికాప్టర్‌ చక్కర్లు.. తిరుమలలో ఏం జరుగుతుంది?

తిరుమలలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం ఇప్పుడు కలకలం రేపుతుంది. తిరుపతిలో డ్రోన్లు , హెలికాప్టర్లు ఎగరవేయరాదనే రూల్ ఉంది


Published Oct 21, 2024 06:31:00 PM
postImages/2024-10-21/1729515733_tml1.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తిరుమలలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం ఇప్పుడు కలకలం రేపుతుంది. తిరుపతిలో డ్రోన్లు , హెలికాప్టర్లు ఎగరవేయరాదనే రూల్ ఉంది.  అది బ్రేక్ చేస్తూ  తిరుమలలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంపై భక్తులతో పాటు తిరుపతి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతవరకు భయాందోళనకు కూడా గురయ్యారు.


అందుకే తిరుపతిలో నో ఫ్లే జోన్‌ను పోలీసులు ప్రకటించారు. ఈ నిబంధన ఉన్నా ఆకాశంలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధమని భక్తులు మండిపాడున్నారు. 


ఈ విషయంపై ఏవీయేషన్ అధికారులకు టీటీడీ సమాచారం అందించారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంపై వారు అధికారులతో చర్చిస్తున్నారు. ఇటీవలే తిరుపతి లడ్డూలలో జంతు కొవ్వు ఉందనే ఆరోపణల వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలో నిజం లేదని ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తోసిపుచ్చింది. అయితే ఇప్పుడు హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంపై మరోసారి తీవ్రగగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల రూల్స్ మరింత కట్టుదిట్టం చెయ్యాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : ap-news newslinetelugu tirumala tirumala-laddu

Related Articles