హీరో బాలయ్యను ఉరికించుకుంటూ కొట్టారట..ఎవరంటే.?

నందమూరి ఫ్యామిలీ అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే.  ఆయన ఒక్కడే తన ఫ్యామిలీని అంచలంచలుగా విస్తరించగలిగాడు. అలా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఎంతోమంది  ఇండస్ట్రీలో పలు రంగాల్లో  రాణిస్తున్నారు. ఇందులో కొంతమంది సినిమాల్లో రాణిస్తుండగా మరి కొంతమంది రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.  అలాంటి వారిలో బాలకృష్ణ రాజకీయాలు మరోవైపు సినిమాల్లో ముందుకు వెళ్తున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-10/1720595342_9tseDg2dGrLQTgMFJRh4ppLeAw8JOOBx.jpg

న్యూస్ లైన్ డెస్క్: నందమూరి ఫ్యామిలీ అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే.  ఆయన ఒక్కడే తన ఫ్యామిలీని అంచలంచలుగా విస్తరించగలిగాడు. అలా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఎంతోమంది  ఇండస్ట్రీలో పలు రంగాల్లో  రాణిస్తున్నారు. ఇందులో కొంతమంది సినిమాల్లో రాణిస్తుండగా మరి కొంతమంది రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.  అలాంటి వారిలో బాలకృష్ణ రాజకీయాలు మరోవైపు సినిమాల్లో ముందుకు వెళ్తున్నారు.

అలాంటి బాలకృష్ణను ఆ హీరో ఉరికించుకుంటూ కొట్టారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం. అయితే బాలకృష్ణ ఫ్యామిలీ చాలా పెద్దది. బాలకృష్ణ తన అక్కలు, తమ్ముళ్లు అందరూ హైదరాబాదులో పెరిగితే అన్నయ్యలు వారి సొంతూరులో తాతయ్య వద్ద పెరిగారట. ఇందులో హరికృష్ణ కూడా తాతయ్య వద్ద పెరుగుతూ వచ్చారట. ఇదే కాదు హరికృష్ణ వ్యవసాయ పనులన్నీ చూసుకుంటూ తన తాతయ్యతో ఊళ్లోనే ఉండేవారట. ఆ తర్వాత కొన్నాళ్లకు తన తండ్రి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తండ్రి వెంట ఉంటూ పార్టీని నడిపించుకుంటూ వచ్చారట.

అలా హరికృష్ణ  చిన్నతనం నుంచి   చాలా సీరియస్ గా గాంభీరంగా ఉండే వ్యక్తట. ఆయన ముఖ కదిలికలే చాలా హుందాగా కనపడతాయట. ఆయనను చూస్తేనే చాలామంది భయపడే వారట. చివరికి వాళ్ళ నాన్న కూడా హరికృష్ణ గట్టిగా మాట్లాడితే భయపడేవాడట. అలాంటి హరికృష్ణ  ఓ రోజు తన తాతతో కలిసి ఊర్లో పొలం వద్ద పనులు చేస్తుండగా బాలకృష్ణ  ఆ పొలం వద్దకు వెళ్లి ఈ పొలాలన్నీ మావే, అంటూ తన ఫ్రెండ్స్ కు  స్టైల్ గా చెప్పారట. దీంతో కోపానికి వచ్చినటువంటి హరికృష్ణ కట్టే పట్టుకొని బాలకృష్ణను ఇంటి దాకా తీసుకెళ్లారట.

నా పొలం అంటావా కష్టపడి పని చేయడం తెలియదు కానీ  స్టైల్ గా వచ్చి ఇది నా పొలం అంటూ మాట్లాడతావా కోతకోశావా, నారు వేశావా, పంట పండించావా.? ఇది నీది అని ఎలా చెబుతున్నావ్ అంటూ  బాలకృష్ణని కొట్టాడట. దీంతో హరికృష్ణకు తాత కూడా సపోర్ట్ చేశారట.  ఆ విధంగా బాలకృష్ణ చిన్నతనంలో తన అన్నతో దెబ్బలు తిన్నానని, ఆయాన అప్పుడు కొట్టింది కూడా నా మంచి కోసమే అని చెప్పుకొచ్చారు. నేను చాలా అహంకార భావంతో నా పొలమని చెప్పుకొచ్చాను. ఆ పొలంలో పనిచేసింది అన్నయ్య పనివాళ్ళు.  అందులో వచ్చిన పంటను నేను తింటూ వచ్చాను. కానీ కష్టపడకుండానే, ఇది నా పొలం అని చెప్పడం వల్ల అన్నయ్యకు కోపం వచ్చి నన్ను కొట్టారని చెప్పుకొచ్చారు.

newsline-whatsapp-channel
Tags : tdp sr-ntr balakrishna harikrishna fighting

Related Articles