Soundarya: సౌందర్య ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన హీరోయిన్.. కానీ చివరికి..?

తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సౌందర్య ప్రస్తుతం మరణించినప్పటికీ ఆమె సినిమాలు ఇప్పటికీ కూడా అభిమానులను అలరిస్తూనే ఉంటాయి. ఇక సౌందర్య లాంటి హీరోయిన్ ఇప్పటి జనరేషన్ లో లేదనే చెప్పుకోవచ్చు. ఆమె ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. అయితే ఈ జనరేషన్ లో హీరోయిన్స్ కు స్టార్ స్టేటస్ రావాలంటే ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ చేయాల్సిందే. అయితే అలాంటి హీరోయిన్ సౌందర్య ఇంటికి మరో హీరోయిన్ కోడలుగా వెళ్లేదట. కానీ చివరికి సీన్ మొత్తం రివర్స్ అయిందట.మరి ఇంతకీ సౌందర్య ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన ఆ హీరోయిన్ ఎవరు? వీరి బంధుత్వం ఎక్కడ చెడింది అనేది ఇప్పుడు చూద్దాం..


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721402798_soundarya.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సౌందర్య ప్రస్తుతం మరణించినప్పటికీ ఆమె సినిమాలు ఇప్పటికీ కూడా అభిమానులను అలరిస్తూనే ఉంటాయి. ఇక సౌందర్య లాంటి హీరోయిన్ ఇప్పటి జనరేషన్ లో లేదనే చెప్పుకోవచ్చు. ఆమె ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. అయితే ఈ జనరేషన్ లో హీరోయిన్స్ కు స్టార్ స్టేటస్ రావాలంటే ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ చేయాల్సిందే.

అయితే అలాంటి హీరోయిన్ సౌందర్య ఇంటికి మరో హీరోయిన్ కోడలుగా వెళ్లేదట. కానీ చివరికి సీన్ మొత్తం రివర్స్ అయిందట.మరి ఇంతకీ సౌందర్య ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన ఆ హీరోయిన్ ఎవరు? వీరి బంధుత్వం ఎక్కడ చెడింది అనేది ఇప్పుడు చూద్దాం.. సౌందర్య ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ నటి ఆమని. సౌందర్య, ఆమని ఇద్దరు మంచి మిత్రులు. వీళ్ళిద్దరూ సినిమాల్లో రాణించినప్పటినుండి చాలా మంచి సన్నిహితులుగా మారిపోయారు.

అలా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో ఆమని తరచూ సౌందర్య ఇంటికి వెళ్లేదట.అలా వెళ్లిన సమయం లో ఆమని ప్రవర్తన గమనించిన సౌందర్య తల్లిదండ్రులు ఎలాగైనా సరే ఆమని ని తమ ఇంటి కోడలి గా చేసుకోవాలి అనుకున్నారట. అంతేకాదు ఓసారి ఉండబట్టలేక డైరెక్ట్ గా ఆమనిని మా అబ్బాయిని పెళ్లి చేసుకో అని అడిగారట. అయితే ఈ విషయం అడగడంతోనే ఆమని,సౌందర్య ఇద్దరు షాకయ్యి ఒక నిమిషం అలాగే ఉండిపోయారట.

అయితే అసలు విషయం ఏమిటంటే..సౌందర్య పేరెంట్స్ కి సౌందర్య అన్న అమర్ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే విషయం తెలియదు. దాంతో ఆమనిని పెళ్లి చేసుకోమని అడిగారట. కానీ అమర్ కి వేరే లవర్ ఉందనే విషయం తెలిసిన ఆమని పెళ్లికి ఒప్పుకోలేదు. అలా ఒకవేళ సౌందర్య అన్నయ్య అమర్ కి లవర్ లేకపోతే ఆమని కచ్చితంగా సౌందర్య ఇంటికి కోడలుగా వెళ్ళేది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu soundarya aamani amar soundarya-parents

Related Articles