హెచ్ఐవి మహమ్మారి ఈ పేరు చెప్తేనే కొంతమంది వనికి పోతుంటారు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల పైగా మంది ఈ వ్యాధి బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ వైరస్
న్యూస్ లైన్ డెస్క్: హెచ్ఐవి మహమ్మారి ఈ పేరు చెప్తేనే కొంతమంది వనికి పోతుంటారు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల పైగా మంది ఈ వ్యాధి బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ వైరస్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడుతున్నా కానీ ఇప్పటివరకు దీనికి మందు కనిపెట్టలేకపోయారు శాస్త్రవేత్తలు, దీనికి ప్రధాన కారణం వైరస్ అనేది ఎప్పటికప్పుడు మార్పు చెందడం వల్ల రోగ నిరోధక శక్తికి అది దొరకకుండా ఉంటుందట. దీనివల్ల ఈ వైరస్ కు సరైన టీకాను కనిపెట్టలేకపోయారు శాస్త్రవేత్తలు. వైరస్ బాడీలో ఉందంటే దానికి మందు కనిపెట్టిలోపు ఆ వైరస్ మరో విధంగా రూపాంతరం చెందుతుందట.
అలా వారం రోజుల్లో తన రూపాన్ని మార్చుకోవడం వల్ల టీకాను కనిపెట్టడం ఇబ్బందికరంగా మారిందట. ఇప్పటికే 7 రకాల వ్యాక్సిన్ డోసులతో కూడిన టీకాను తయారు చేశారట. కానీ ఇది అంతంత మాత్రంగానే ప్రభావం చూపుతోందని అంటున్నారు. కానీ తాజాగా అమెరికాలోని MIT శాస్త్రవేత్తలు హెచ్ఐవి నియంత్రణ కోసం ఒక టీకాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని తెలుస్తోంది. ఈ టీకాను వారంలో రెండు మోతాదులుగా ఇస్తారట.
మొదటి డోసులో 20% వ్యాక్సిన్, రెండవ డోసులో 80% వ్యాక్సిన్ రోజుకి వేస్తారట. అయితే ఈ రెండు డోసులతో వైరస్ మ్యూటేషన్ జరిగే లోగా టీకా తన పని తాను చేస్తుందని రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్ ను చంపేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎలుకలపై జరిపినటువంటి ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని పరిశోధకులు అన్నారు.