ఎప్పటివో పాత చిట్కాలన్నీ ...ఫాలో అయ్యి గాయాన్ని మరింత పెద్దది చేసేస్తారు. అయితే కాలిన గాయానికి మొదట ఏం చెయ్యాలో చూద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దీపావళి అంటాం కాని ..సరదా కంటే భయమే ఎక్కువ ఉంటుంది. పిల్లలకు సరదా..పెద్దవాళ్లకు భయం. అయితే కొన్ని సార్లు పటాకులు పేల్చే ఉత్సాహంలో పిల్లలు చేతులు కాల్చుకుంటారు చాలా సాధారణం కూడా. అసలు అలా కాలితే వెంటనే కంగారుపడి ...ఎప్పటివో పాత చిట్కాలన్నీ ...ఫాలో అయ్యి గాయాన్ని మరింత పెద్దది చేసేస్తారు. అయితే కాలిన గాయానికి మొదట ఏం చెయ్యాలో చూద్దాం.
బాణసంచాలో ఉపయోగించే రసాయనాల వలన వేడి. గాయాల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కనుక.. ఈ పటాకులు కాల్చడం వల్ల పిల్లలు గాయపడితే ఆ బాధ మరింత అధికంగా ఉంటుంది. అందులోను కాస్త చల్లగాలులు వస్తున్నాయి శరీరానికి ఏ చిన్న వస్తువు తగిలినా నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. కాలినవెంటనే శరీరం మీద బొబ్బలు వస్తాయి.
* బొబ్బలు వస్తే ...వాటిని పగలగొట్టకండి శరీరం కాలిన వెంటనే ఆ భాగాన్ని హీల్ చెయ్యడానికి శరీరం నుంచి కొంత నీరు ఆ ప్రదేశానికి చేరుతుంది. అది అలానే వదిలేస్తే చాలా ఫాస్ట్ గా గాయం తగ్గుతుంది. పగిలిందా...మీరు రెండు మూడు వారాలు ఇబ్బందిపడాల్సిందే .
*పటాకులు పేల్చే సమయంలో మంటలు చెలరేగి.. ఎవరినైనా తాకితే.. వెంటనే బట్టలు, నగలు, బెల్టులు అన్నీ తీసేయండి. సాధ్యమైనంత వరకు బట్టలు కాటన్ వేసుకొండి. వీటి వల్ల మంట తగిలినా ...చిన్నగా కాలి ఆరిపోతుంది. అదే సిల్క్ అయితే చుట్టుకుపోయి శరీరాన్ని మరింత కాల్చేస్తుంది.
* ఎవరైనా పటాకుల వలన కాలిన గాయంతో బాధపడుతుంటే.. అలా గాయపడిన ప్రాంతాన్ని చల్లటి నీటితో కడగాలి. ఐస్ పెట్టడం వల్ల స్కిన్ ఇంకా కమిలిపోతుంది. దీని వల్ల నష్టమే కాని లాభం ఉండదు.
* కాలిన ప్రదేశంలో పసుపు రాయకండి. దెబ్బ తగిలినపుడు పెడతాం కదా అంటారేమో...కట్ అయినపుడు పసుపు వల్ల రక్తం గడ్డకడుతుంది కాబట్టి పెడతాం. అదే కాలినపుడు పెడితే ..పసుపు కారణంగా చీము పట్టే అవకాశం ఉండి మరింత నొప్పిని కలిగిస్తుంది.
* కాలిన భాగాన్ని సాధారణ స్థాయి కంటే కొంచెం ఎత్తులో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో వాపు తగ్గుతుంది. నీరు చేరదు. చేతులు, కాళ్ళను వీలైనంత నిటారుగా ఎత్తులో పెట్టుకోవాలి.