అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ ఇంజన్లను రప్పించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
న్యూస్ లైన్ డెస్క్: విశాఖపట్నం బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డైనో పార్క్ రెస్టో కేఫ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరోవైపు ఆ ప్రాంతంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో డైనో పార్క్ రెస్టో కేఫ్ పూర్తిగా దగ్దమైనట్లు తెలుస్తోంది.
అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ ఇంజన్లను రప్పించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం కారణంగా భారీగా ఆస్థి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.