వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన నెల రోజుల్లోనే డెంగ్యూ కారణంగా ఆరుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. వీరిలో సదాశివ నగర్ మండలానికి చెందిన వారి ముగ్గురు ఉన్నారు. పెద్ద సంఖ్యలో యాక్టీవ్ కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే హాస్పిటళ్లలో భారీగా డెంగ్యూ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలోనే గత పది రోజుల్లో డెంగ్యూ, విష జ్వరాలతో పదిమంది ప్రాణాలు విడిచారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో 400, భద్రాద్రి జిల్లాలో 130 చొప్పున డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా.. కామారెడ్డి జిల్లాలో కూడా డెంగ్యూ విజృంభిస్తోంది. వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన నెల రోజుల్లోనే డెంగ్యూ కారణంగా ఆరుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. వీరిలో సదాశివ నగర్ మండలానికి చెందిన వారి ముగ్గురు ఉన్నారు. పెద్ద సంఖ్యలో యాక్టీవ్ కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు వెల్లడించారు. మరోవైపు డెంగ్యూ బారిన పడి చికిత్స కోసం వెళ్లిన వారి నుంచి ప్రైవేట్ డాక్టర్లు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని పేషేంట్లు వాపోతున్నారు.