ఇంటిని లోటస్ పాండ్‌లోని చెరువు శిఖంలో జగన్ ఇల్లు ఉన్నట్లుగా హైడ్రా అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా ఆ ఇంటిని కూల్చేయాలంటూ నోటీసులు పంపించామని వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హైడ్రా నోటీసులు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. శనివారం ఉదయం ఆయనకు హైడ్రా కమిషన్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు పలు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయన ఇల్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇంటిని లోటస్ పాండ్‌లోని చెరువు శిఖంలో జగన్ ఇల్లు ఉన్నట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే వీలైనంత త్వరగా ఆ ఇంటిని కూల్చేయాలంటూ హైడ్రా నోటీసులు పంపించిందని పలువురు చెబుతున్నారు.
కాగా, ఇప్పటికే ఆయన ఇంటి వద్ద ఒకసారి అక్రమ నిర్మాణాల కొల్చివేతలు జరిగిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేతల ఘటనలో ఓ అధికారిపై వేటు కూడా పడింది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేను GHMC కమిషనర్ ట్రాన్స్‌ఫర్ చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు జరిపినందుకు అధికారులు ఆయనను బదిలీ చేశారు. ఓ మంత్రి ఆదేశాలతో GHMC అధికారులు జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చివేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాండ్ స్థలంలో ఇల్లు నిర్మించారనే ఆరోపణలతో జగన్‌కి కూడా హైడ్రా నోటీసులు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ నోటీసులు వెళ్లడం అనేది నిజామా..లేదా వట్టి ప్రచారమేనా అనేది తేలాల్సి ఉంది.