ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది సంపాదన మత్తులో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. చివరికి సంపాదించిందంతా మళ్లీ హాస్పటల్లో పెడుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్:ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది సంపాదన మత్తులో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. చివరికి సంపాదించిందంతా మళ్లీ హాస్పటల్లో పెడుతున్నారు. అంతేకాకుండా ఫుడ్ విషయంలో కూడా రెస్ట్రిక్షన్స్ పాటించకుండా ఇష్టం వచ్చినటువంటి ఫుడ్ తిని ఎన్నో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. పూర్వకాలంలో వారు ఏం తిన్నారో ఏమో కానీ కనీసం జ్వరం కూడా వచ్చేది కాదట. చిన్నపిల్లలకు కూడా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి.
ప్రధాన కారణం మనం పెరిగే వాతావరణం తినే ఫుడ్ అని చెప్పవచ్చు. ఇదే కాకుండా ఎన్నో జీర్ణ సమస్యలు కంటి సమస్యలు ఇలా ఎన్నో చిన్న వయసులోనే వస్తున్నాయి. ఈ సమస్యలు వస్తే టక్కున హాస్పిటల్ మనం పరిగెడతాం. కానీ పూర్వకాలంలో అయితే నాటు వైద్యంతోనే నయం చేసేవారు. అలా పరిసరాలను దొరికే ఆకులలో తమలపాకులు కూడా ఒకటి. ఈ ఆకులతో మన ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుందట.
ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తుండట. ఈ తమలపాకులో ఉండే యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ వంటివి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. అంతే కాకుండా ఇందులో ఉండే థయామీన్, విటమిన్ సి, రీబోఫ్లోవీన్, వంటి విటమిన్స్ పుష్కలంగా ఉండడంవల్ల శరీరంలోని అనేక సమస్యలకు ఉపశమనాన్ని అందిస్తుంది.
అలాగే తమలపాకు తినడం వల్ల గొంతు, దంత వ్యాధులు కూడా నయమవుతాయి. ఈ ఆకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం, జలుబు వంటి సమస్యలు పోవడమే కాకుండా జీర్ణశక్తి మెరుగవుతుందట. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తమలపాకులు దూరం చేస్తాయట. అంతేకాకుండా తమలపాకు బరువు తగ్గించడంతో పాటు గ్యాస్, గుండెలో మంట వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రతిరోజు ఒక్క ఆకు తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని తెలియజేస్తున్నారు.