Samantha: అక్కినేని ఫ్యామిలీలో సమంతకి ఘోర అవమానం..?

ఏ మాయ చేసావే సినిమాతో అందరి మతులు పోగొట్టిన ముద్దుగుమ్మ సమంత.. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో చక్రం తిప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే అక్కినేని వారసుడు నాగచైతన్యతో ప్రేమలో పడి ఎన్నో రోజులు వారి బంధాన్ని రహస్యంగా కంటిన్యూ చేసింది.వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని పెళ్లి బంధం గా మార్చుకొని ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. యితే పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి ఈ జంట కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.తాజాగా అక్కినేని ఫ్యామిలీలో సమంతకి ఘోర అవమానం జరిగినట్టు టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే...చాలా రోజుల నుండి సమంతకి సంబంధించిన ఫోటోలు,ఆల్బమ్స్ అక్కినేని ఫ్యామిలీలోని స్టోర్ రూమ్ లో ఉన్నాయట. అయితే ఇన్ని రోజులు వారి స్టోర్ రూమ్ లోనే ఆ ఫోటోలను ఉంచినప్పటికీ ఈ మధ్యనే ఆ ఫోటోలను తీసి బయట పారేసినట్టు తెలుస్తోంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-12/1720783634_sam.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఏ మాయ చేసావే సినిమాతో అందరి మతులు పోగొట్టిన ముద్దుగుమ్మ సమంత.. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో చక్రం తిప్పిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ సమంతకు ఎన్నో సంవత్సరాలు ఉపయోగపడింది.అలా వరుసగా స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా పేరుగాంచింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే అక్కినేని వారసుడు నాగచైతన్యతో ప్రేమలో పడి ఎన్నో రోజులు వారి బంధాన్ని రహస్యంగా కంటిన్యూ చేసింది.

అయితే వీరి బంధం ఎప్పుడో ఒక సమయంలో బయటపడక తప్పదు. అలా వీరిపై ఎన్నో రూమర్స్ నెట్టింట్లో వినిపించాయి.అయితే వాటిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ అనూహ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని పెళ్లి బంధం గా మార్చుకొని ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన న్యూస్ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.అయితే పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి ఈ జంట కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.

ఇక వీరు విడాకులు తీసుకొని ఎన్ని సంవత్సరాలైనా కూడా మళ్లీ ఈ జంట కలవాలి అని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు.అంతేకాదు వారికి ఏ నమ్మకం ఉందో ఏమో తెలియదు కానీ ఎప్పటికైనా ఈ జంట మళ్ళీ కలుస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా అక్కినేని ఫ్యామిలీలో సమంతకి ఘోర అవమానం జరిగినట్టు టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే...చాలా రోజుల నుండి సమంతకి సంబంధించిన ఫోటోలు,ఆల్బమ్స్ అక్కినేని ఫ్యామిలీలోని స్టోర్ రూమ్ లో ఉన్నాయట.

అయితే ఇన్ని రోజులు వారి స్టోర్ రూమ్ లోనే ఆ ఫోటోలను ఉంచినప్పటికీ ఈ మధ్యనే ఆ ఫోటోలను తీసి బయట పారేసినట్టు తెలుస్తోంది. దీంతో అక్కినేని ఫ్యామిలీ వారికి కూడా అర్థమైపోయింది కావచ్చు.ఇక సమంత మళ్ళి నాగచైతన్యని కలవదు అని అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.అంతేకాదు సమంతకు జరిగిన ఈ అవమానం పగవాడికి కూడా జరగకూడదు రా నాయనా అంటూ సమంత పై కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయమే టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. ఇక నాగచైతన్య తండేల్ సినిమాలో బిజీ గా ఉంటే సమంత ఓ వెబ్ సిరీస్ అలాగే మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉంది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu samantha nagachaitanya tandel akkineni-family

Related Articles