Prabhas: ప్రభాస్ మూవీలో jr: ఎన్టీఆర్..రెబల్ స్టార్ ను మించిన పాత్ర.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే  పాన్ వరల్డ్  హీరో.ఈయనంటే తెలియని వారు ఉండరు.  బాహుబలి చిత్రం ద్వారా ప్రపంచ స్థాయి హీరోగా మారిన ప్రభాస్ ఆ తర్వాత అన్నీ అలాంటి చిత్రాలే చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన  నటించిన  కల్కి 2898AD మూవీ భారీ హిట్ అయింది. అలాంటి ప్రభాస్ నటించే సినిమాల్లో  ఎన్టీఆర్ కూడా ఒక పాత్ర చేస్తున్నారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్..తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ తర్వాత అంతటి ఆదరణ పొందిన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే నటుడు. అయితే ఎన్టీఆర్ విభిన్నమైన పాత్రలు చేయడంలో దిట్ట.


Published Jul 26, 2024 12:59:33 PM
postImages/2024-07-26/1721978973_ntr.jpg

న్యూస్ లైన్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే  పాన్ వరల్డ్  హీరో.ఈయనంటే తెలియని వారు ఉండరు.  బాహుబలి చిత్రం ద్వారా ప్రపంచ స్థాయి హీరోగా మారిన ప్రభాస్ ఆ తర్వాత అన్నీ అలాంటి చిత్రాలే చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన  నటించిన  కల్కి 2898AD మూవీ భారీ హిట్ అయింది. అలాంటి ప్రభాస్ నటించే సినిమాల్లో  ఎన్టీఆర్ కూడా ఒక పాత్ర చేస్తున్నారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

జూనియర్ ఎన్టీఆర్..తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ తర్వాత అంతటి ఆదరణ పొందిన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే నటుడు. అయితే ఎన్టీఆర్ విభిన్నమైన పాత్రలు చేయడంలో దిట్ట. అయితే ఎన్టీఆర్ స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో  నటించబోతున్నాడని ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.  

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర, వార్ 2,డ్రాగన్ సినిమాలు చేయబోతున్నారు.ఇప్పటికే దేవర షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంటుంది. అయితే ఈ సినిమాలతో పాటు ప్రభాస్ హనూ రాఘవపూడి దర్శకత్వంలో  రాబోతున్న ఫౌజీ అనే చిత్రంలో jr. ఎన్టీఆర్ చేయబోతున్నారట.  1943 ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఆజాద్ హిందూ ఫౌజీ లో ఒక సైనికుడిగా ప్రభాస్ చేస్తాడని.

 ఆ మూవీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా కాసేపు ఉంటుందని,ఈ పాత్రను ఎన్టీఆర్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా యూనిట్ ఎన్టీఆర్ ని కలిసి చెప్పగా ఆయన సుముఖంగానే స్పందించినట్టు సమాచారం. ఒకవేళ ఈ సినిమా అంతా ఓకే అయితే మాత్రం ఓ  వైపు ప్రభాస్ అభిమానులు మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటారని చెప్పవచ్చు.

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu jr-ntr hanu-raghavapudi subhash-chandrabose prabhas-fauji-movie

Related Articles