indian 2: ఇండియన్-2 సినిమాలో శంకర్ చేసిన బిగ్ బ్లండర్స్..?

భారతీయుడు 2 అప్పుడెప్పుడో 28 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాను ఇప్పుడు మళ్లీ సెకండ్ పార్ట్ తియ్యాలనే ఆలోచన రావడమే పెద్ద ప్రాబ్లమ్. అప్పట్లో నచ్చిన ఎన్నో వస్తువులు ..ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్..అలానే శంకర్ ఆలోచన కూడా ఓల్డ్ ఫ్యాషనే. ఈ రేంజ్ సినిమాకు ఐదేళ్లు వెయిట్ చేసేంత సీన్ లేదు...కథ కోసం కాదు..శంకర్ సినిమాకోసం వెయిట్ చేశారు జనాలు. కాని శంకర్ ఆ మ్యాజిక్ ను మిస్ చేసేశారు. 


Published Jul 14, 2024 11:20:21 AM
postImages/2024-07-14/1720961163_2569523450c9428fb8641616d3a04f66.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారతీయుడు 2 అప్పుడెప్పుడో 28 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాను ఇప్పుడు మళ్లీ సెకండ్ పార్ట్ తియ్యాలనే ఆలోచన రావడమే పెద్ద ప్రాబ్లమ్. అప్పట్లో నచ్చిన ఎన్నో వస్తువులు ..ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్..అలానే శంకర్ ఆలోచన కూడా ఓల్డ్ ఫ్యాషనే. ఈ రేంజ్ సినిమాకు ఐదేళ్లు వెయిట్ చేసేంత సీన్ లేదు...కథ కోసం కాదు..శంకర్ సినిమాకోసం వెయిట్ చేశారు జనాలు. కాని శంకర్ ఆ మ్యాజిక్ ను మిస్ చేసేశారు. 


2017లో  ఇండియన్ 2 సినిమాను అనౌన్స్ చేస్తే ....లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ సినిమా 2019లో పట్టాలెక్కింది.శంకర్, కమల్‌ హాసన్ 2024 లో ఈ మూవీ కంప్లీట్ అయ్యింది. డైరక్టర్ శంకర్ ఈ సినిమా ను అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం  తీయలేదు. ఇక తియ్యలేక ..జనాల మీదకు వదిలినట్టు రిలీజ్ చేశాడు. ఓ జనరేషన్ గ్యాప్ ఉన్న సినిమా కాన్సప్ట్ తో ఇప్పుడు సినిమా తియ్యాలనుకోవడమే సాహసం. భారతీయుడు ఓ క్లాసిక్...అలాగే వదిలేస్తే బాగుండేది . పార్ట్ 2 , ఇంకా పార్ట్ 3 కూడా తీస్తానంటున్నాడు శంకర్.. పార్ట్ 2 కే డబ్బులు వేస్ట్ ..ఇక పార్ట్ 3 కూడానా అంటున్నారు ఆడియన్స్. అసలు పార్ట్ 2, పార్ట్ 3 ఆలోచనే పెద్ద బ్లండర్.


28 యేళ్ల క్రితం అవినీతి అనేది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు అది పెద్ద సమస్యే కాదు. డబ్బులున్నవాడు లంచం ఇస్తాడు..లేనివాడు ఇబ్బందులు పడతాడు..తప్పదు పని కావాలంటే ఖర్చు పెట్టాలి..ఇప్పుడు ఈ టైప్ ఆలోచనా ధోరణిలో ఉన్నారు జనాలు. ఈ కాన్సప్ట్ తో శంకర్ పార్ట్ 2 తీసుకురావడం మరొక బ్లండర్.


భారతీయుడు-2లో అలాంటి ఎమోషనల్ సీన్లు ఒక్కటీ లేకపోవడం షాకింగ్ విషయం. భారతీయుడు లో తను అలా మారడానికి తన కూతురు పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ హైలెట్..ఈ పార్ట్ లో ... 28 యేళ్లు గడిచినా భారతీయుడు ఇంకా యంగ్ గా అలా గంతులెయ్యడం మన వాళ్లకి నచ్చలేదు. కుళ్లు ..ఎందుకు బెండ్ అవ్వలేదు...కమల్ సూపర్ మ్యానా అంటూ డౌట్స్ అడుగుతున్నారు . ఇదే కూడా ఓ రీజన్.


తమిళనాడులోనే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి.రెమ్యునరేషన్ మొత్తం ముందే ఇవ్వాలి అని కమల్‌ హాసన్ గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ జనాల్లో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. సినిమా అటు ఇటు అవుతుందేమో అందుకే రెమ్యునిరేషన్ అడుగుతున్నారంటు పుకార్లు పుట్టాయి. పూర్ కేరక్టరైజేషన్, పూర్ ప్రజెంటేషన్,  ఇది కూడా శంకర్ బ్లండరే. ఇప్పుడు ఈ సినిమా చూసి రామ్ చరణ్ సినిమా సంగతి ఏంటో భయపడుతున్నారు మెగా ఫ్యాన్స్. చూద్దాం ...వెయిట్ చెయ్యక మనం చెయ్యగలిగేది ఏముంది.
 

newsline-whatsapp-channel
Tags : indian2 movie-news shankar-director

Related Articles