శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ కాస్త తడబడుతున్నా రామ్ చరణ్ క్రేజ్ తో సినిమా మీద అంచనాలున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ దగ్గరపడుతుంది . కరెక్ట్ గా మరో 20 రోజుల్లో సినిమా రిలీజ్ . అభిమానులు రచ్చ లేపుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత వస్తున్న భారీ బడ్జెట్ మూవీ అది శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ కాస్త తడబడుతున్నా రామ్ చరణ్ క్రేజ్ తో సినిమా మీద అంచనాలున్నాయి.గేమ్ చేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మూవీ ప్రమోషన్స్ కు మూవీ టీం ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకొని మూవీ మీద బజ్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో, డిసెంబరు 29న భారతదేశంలోనే అతి పెద్దదైన రామ్ చరణ్ కటౌట్ ను ఏర్పాటుచేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు... విజయవాడ బృందావన్ కాలనీలో వజ్రా గ్రౌండ్స్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచి ఈ కటౌట్ ప్రారంభం చేస్తామని మూవీ టీం అనౌన్స్ చేసింది.
తమన్ సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలు ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. దానికి తోడు టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా తమ చిత్రం ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇండియన్ 2 శంకర్ కు పెద్ద లాస్. దీని ఎఫెక్ట్ కూడా జనాల మీదుంది. శంకర్ అవుట్ ఆఫ్ బాక్స్ లో ఉన్నారనే టాక్ కూడా ఉంది. అయినా శంకర్ ను అంత ఈజీ గా తీసేయడానికి లేదు. అంచనాలు దాటి బ్లాక్ బాస్టర్లు తీసిన డైరక్టర్ కథ ఏదైనా కావచ్చు. శంకర్ మార్క్ తప్పక ఉంటుంది.