Rakshabhandan:సోదరి రాఖీ కట్టే టైంలో ఈ తప్పులు చేశారో  సోదరుడికి ప్రమాదమేనా.?

: శ్రావణమాసం పౌర్ణమి రోజున అన్న చెల్లెల అనుబంధం అయినటువంటి  రాఖీ పండుగను జరుపుకుంటారు. అలాంటి ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. అయితే ఈ పండుగ


Published Aug 17, 2024 10:30:50 AM
postImages/2024-08-17/1723870850_rakhi.jpg

న్యూస్ లైన్ డెస్క్: శ్రావణమాసం పౌర్ణమి రోజున అన్న చెల్లెల అనుబంధం అయినటువంటి  రాఖీ పండుగను జరుపుకుంటారు. అలాంటి ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. అయితే ఈ పండుగ విషయంలో కూడా కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయట. ఈ పండగను ఎప్పుడు జరుపుకోవాలి. ఎలా జరుపుకోవాలి అనే వివరాలు చూద్దాం.. ఈ పండగ రోజున సోదరీమణులు వారి యొక్క సోదరులు జీవిత కాలం సంతోషంగా జీవించాలని కోరుతూ రాఖీ కడతారు.

అంతేకాదు సోదరులు వారి యొక్క సోదరీమణులకు బహుమతులు కూడా ఇస్తారు.  మంచి చెడు సమయంలో సోదరీమణులకు ఎల్లప్పుడూ ఆదుకుంటామని వాగ్దానం కూడా చేస్తారు. అలా రాఖీ పండుగను ఉత్సాహంతో జరుపుతారు. అయితే చాలామంది రాఖీ కట్టిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ విప్పిపడేస్తారు. కానీ ఈ తప్పు అస్సలు చేయకూడదట. ఇలా చేయడం అశుభమని, ఎన్ని రోజుల ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పండితులు తెలిపిన దాని ప్రకారం రక్షాబంధన్ ఆగస్టు 19 సోమవారం రోజున వస్తోంది.  ఈసారి రాఖీ పండుగ రోజున బద్ర నీడ ఉంటుంది కాబట్టి ఈ రక్షాబంధన్ పండుగను మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత జరుపుకోవాలని జ్యోతిష్యులు అంటున్నారు.  అంతేకాకుండా మధ్యాహ్నం 1:46 నుండి మొదలు 4:19 మనకు రాఖి కట్టడానికి అనుకూలమైనటువంటి టైం. సాయంత్రం శుభ సమయం. సాయంత్రం 6.56 నుండి రాత్రి 9.07వరకు మంచి సమయం.

ముఖ్యంగా రాఖీ కట్టే సమయంలో సోదరుడు తూర్పుముఖంగా కూర్చోవడం శుభప్రదం. సోదరి పడమర ముఖంగా ఉండి రాఖీ కట్టడం మంచిది. అయితే ఈ రాఖీ కట్టిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో మనం తీసివేయకూడదట.  కఠిన రాకిని 21 రోజుల వరకు ఉంచుకోవాలని అంటున్నారు. అయితే రాఖీలు తీసివేస్తే మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదట.  దాన్ని ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి పవిత్ర స్థలంలో వేయాలని పండితులంటున్నారు. వీలు కాకపోతే ప్రవహిస్తున్న నీటిలో అయినా వేయాలట. ఈ విధమైనటువంటి నియమాలు పాటిస్తే  అన్నా చెల్లెళ్లు ఇద్దరికీ మంచి జరుగుతుందని పండితులంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line rakhi rakshabandhon brother sister

Related Articles