తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే, ఎంతో గౌరవం ఉంటుంది. వీరు కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా స్టార్లే.ఎన్టీఆర్ యొక్క నట, రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలకృష్ణ ఓవైపు ఇండస్ట్రీలో మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు.అలాంటి ఈ ఫ్యామిలీలో బాలకృష్ణ వివాహం జరిగిన సమయంలో తన తండ్రి ఎన్టీఆర్ మరియు తన అన్న హరికృష్ణ హాజరు కాలేదట.1982 డిసెంబర్ 8వ తేదీన వ్యాపారవేత్త దేవురపల్లి సూర్యారావు కుమార్తె వసుంధర దేవితో బాలకృష్ణ వివాహం జరిగింది. కానీ ఈ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ హాజరు కాలేదు. ఈ సమయంలో ఎన్టీఆర్ ప్రజా చైతన్య యాత్రలో బిజీగా ఉన్నారట. ఇదే సమయంలో బాలకృష్ణ పెళ్లి కావడంతో ఎన్టీఆర్ కు రావడం కుదరలేదట. అంతే కాదు ఈ చైతన్య యాత్రలో అన్నీ హరికృష్ణనే చూసుకుంటున్నారు.ఇక బాలకృష్ణ పెళ్లి అయిన వెంటనే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారట.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే, ఎంతో గౌరవం ఉంటుంది. వీరు కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా స్టార్లే. నందమూరి ఫ్యామిలీ ఇంతటి స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారకులు సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ యొక్క నట, రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలకృష్ణ ఓవైపు ఇండస్ట్రీలో మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు.
అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ చాలా పెద్దది. మొత్తం ఆయనకు 12 మంది సంతానమైతే ఒకరు మరణించారు. మిగతా అందరికీ పెళ్లిళ్ళై పిల్లలు ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ లో ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్ల కుటుంబమే చాలా పెద్దగా కనిపిస్తుంది. అలాంటి ఈ ఫ్యామిలీలో బాలకృష్ణ వివాహం జరిగిన సమయంలో తన తండ్రి ఎన్టీఆర్ మరియు తన అన్న హరికృష్ణ హాజరు కాలేదట. దీనికి కారణం వారి మధ్య ఏదైనా గొడవ వచ్చిందా అంటే అది కూడా కాదు.
అలాగని బాలకృష్ణ లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అంటే అది కూడా కాదు. బాలకృష్ణది అరేంజ్డ్ మ్యారేజ్. ఎన్టీఆర్ స్వయంగా కుదిర్చారు. మరి అన్ని బాగున్నా ఆయన పెళ్లికి వీరిద్దరు ఎందుకు హాజరు కాలేదని చాలామందికి డౌట్ ఉంటుంది. ఆ వివరాలు ఎంటో చూద్దాం. 1982 డిసెంబర్ 8వ తేదీన వ్యాపారవేత్త దేవురపల్లి సూర్యారావు కుమార్తె వసుంధర దేవితో బాలకృష్ణ వివాహం జరిగింది. కానీ ఈ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ హాజరు కాలేదు.
ఈ సమయంలో ఎన్టీఆర్ ప్రజా చైతన్య యాత్రలో బిజీగా ఉన్నారట. ఇదే సమయంలో బాలకృష్ణ పెళ్లి కావడంతో ఎన్టీఆర్ కు రావడం కుదరలేదట. అంతే కాదు ఈ చైతన్య యాత్రలో అన్నీ హరికృష్ణనే చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రయాణించే కారు ని హరికృష్ణ నడుపుతున్నారట. అందుకే ఆ సమయంలో వీరిద్దరు పెళ్లికి హాజరు కాలేదట. ఇక బాలకృష్ణ పెళ్లి అయిన వెంటనే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారట.