69లో కూడా 29లా మెగాస్టార్ యవ్వన సీక్రెట్ ఇదేనా.?

మెగాస్టార్ చిరంజీవి ఇంకా కొన్ని నెలల్లో ఏడుపాదుల వయసులోకి చేరుకోబోతున్నారు. ఇది అందరికీ ఆశ్చర్యకరమైన విషయమే అయినా  అక్షరాల నిజం. చిరంజీవి ప్రస్తుత వయసు 69 సంవత్సరాలు.


Published Sep 05, 2024 06:41:00 PM
postImages/2024-09-05/1725540687_chiru.jpg

న్యూస్ లైన్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ఇంకా కొన్ని నెలల్లో ఏడుపాదుల వయసులోకి చేరుకోబోతున్నారు. ఇది అందరికీ ఆశ్చర్యకరమైన విషయమే అయినా  అక్షరాల నిజం. చిరంజీవి ప్రస్తుత వయసు 69 సంవత్సరాలు. అయినా ఆయన  ఒక యంగ్ కుర్రాడిలా కనిపిస్తూ ఉంటారు. 69లో కూడా 29ఏళ్ల కుర్రాడిలా  కనిపించడం మెగాస్టార్ సొంతం.  అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా కనిపించడానికి బాగానే కష్టపడతారని  అంటున్నారు. ఉదయం నాలుగు గంటలకే లేచి వ్యాయామం, యోగ చేస్తారట.

అలాగే ఆయన ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానంతో పాటు ఉల్లాసంగా ఉండేందుకు అనేక పనులను నిర్వహిస్తారట. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చిన్న పిల్లలతో సరదాగా ఆడుకుంటారట.  అలాగే స్వచ్ఛంద కార్యక్రమాల్లో కూడా పాల్గోని తనకు నచ్చిన హెల్ప్ చేస్తారట. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ తాను నిద్రకు మాత్రం తప్పనిసరిగా టైం కేటాయిస్తారట.

ముఖ్యంగా చిరంజీవి తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, మాత్రమే తీసుకుంటారట. ముఖ్యంగా వాటర్ కూడా ఎప్పుడు తాగుతూనే ఉంటారట. జంక్ ఫుడ్ అంటే అస్సలు ఇష్టపడరట. వీటి స్థానంలో ఆరోగ్యకరమైన ఫుడ్ తింటారట. ముఖ్యంగా మన తెలుగువారి వంటకాలను ఎక్కువగా ఆస్వాదిస్తారట. డిన్నర్ లో చేపలు, సాంబార్, చికెన్, పులిహోర, పప్పు ఉండేలా చూసుకుంటారట. ఈ విధంగా ప్రతిరోజు ఆయన ఒక క్రమం ప్రకారం డైట్ మెయింటైన్ చేస్తూ ఉండడం వల్లే 69 సంవత్సరాల వయసులోనూ 29ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నానని అంటారు.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu mega-family food-habits surekha young

Related Articles