BRS పూర్తి చేసిన ప్రాజెక్టుల కింద కూడా నీళ్లు ఇవ్వాలని చేతగాని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నాగార్జునసాగర్ కింద కూడా పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వకుండా అధికార దర్పంతో అడ్డగోలు మాటలతో టైంపాస్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.
న్యూస్ లైన్ డెస్క్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ చేతగాని దద్దమ్మ అని మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. శనివారం తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస అవగాహన లేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఉత్తంకుమార్ రెడ్డినే అని మండిపడ్డారు. BRS పూర్తి చేసిన ప్రాజెక్టుల కింద కూడా నీళ్లు ఇవ్వాలని చేతగాని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నాగార్జునసాగర్ కింద కూడా పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వకుండా అధికార దర్పంతో అడ్డగోలు మాటలతో టైంపాస్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంల డెకాయిట్ల పాలన నడుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలకే దొంగ మాటలు వస్తాయని ఆయన అన్నారు. మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ ని తిట్టగానే పెద్ద నేతలు అయిపోతారనే భ్రమలో ఉన్నారని ఆయన అన్నారు. ఇవాళ నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ,కాళేశ్వరం కింద పంటలు ఎండిపోతున్నాయని ఆయన అన్నారు. సోయి లేని ఉత్తమ్ కుమార్ రెడ్డికి రైతుల బాధలు తెలియవని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజుర్నగర్ లో కూడా పంటలు ఎండిపోతున్నాయని జగదీష్ రెడ్డి గుర్తుచేశారు.
కేసీఆర్ సరైన సమయంలో బయటికి వస్తారని ఆయన అన్నారు. అప్పుడు వీళ్ల బండారం బయటపడుతుందని తెలిపారు. ప్రభుత్వం మెడలు ఎలా వంచాలో కేసీఆర్‌కి బాగా తెలుసని ఆయన అన్నారు. కన్నెపల్లి మేడిగడ్డ పంపులను స్టార్ట్ చేసి ఇప్పటికైనా సాగునీరు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సాగర్ కింద ఎత్తిపోతలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని అన్నారు. ఇంకొన్ని రోజుల్లో రైతులే కాంగ్రెస్ నేతలను ఉరికించి కొడతారని ఆయన ఎద్దేవా చేశారు.