Hansika: హన్సికని బెడ్రూం కి పిలిచిన తెలుగు హీరో..?

హన్సిక మోత్వాని అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈమె చిన్న వయసులోనే దేశముదురు సినిమాలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత టాలీవుడ్ లోఎన్టీఆర్, మంచు విష్ణు, గోపీచంద్, నితిన్, సిద్ధార్థ, రవితేజ,రామ్ 


Published Sep 19, 2024 08:30:00 PM
postImages/2024-09-19/1726755431_hansikamotwani.jpg

న్యూస్ లైన్ డెస్క్: హన్సిక మోత్వాని అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈమె చిన్న వయసులోనే దేశముదురు సినిమాలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత టాలీవుడ్ లోఎన్టీఆర్, మంచు విష్ణు, గోపీచంద్, నితిన్, సిద్ధార్థ, రవితేజ,రామ్ పోతినేని, సందీప్ కిషన్ వంటి ఎంతో మంది హీరోలతో జతకట్టింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక చేదు అనుభవం ఎదురయిందట.

మరి ఇంతకీ ఆమెకు ఎదురైనా ఆ చేదు అనుభవం ఏంటి.. హన్సిక మోత్వాని ని బెడ్ రూమ్ కి రమ్మని పిలిచిన ఆ టాలీవుడ్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..హన్సిక మోత్వానికి కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్.

కోలీవుడ్లో కుష్బూ, నమిత తర్వాత అభిమానులు గుడి కట్టిన హీరోయిన్ గా హన్సిక పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి హన్సికని టాలీవుడ్ లో ఓ హీరో చాలా వేధించారట. ఆ హీరోతో సినిమాలో నటించిన సమయంలో చాలాసార్లు నాతో డేటింగ్ కి వస్తావా అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటూ ఎన్నో అసభ్య మాటలు మాట్లాడేవాడట.

అయితే ఆయన టాలీవుడ్ లో పేరున్న హీరో కావడంతో హన్సిక ఏమీ చేయలేక పోయిందట ఇక ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని బాధపడింది. అయితే ఆ హీరో పేరు బయట పెట్టకపోయినప్పటికీ ఆయన మాట్లాడిన అసభ్యమైన మాటలకి తగిన బుద్ధి చెప్పిందట హన్సిక

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kollywood kushboo hansika deshamuduru namitha

Related Articles