Jani Master: జానీ మాస్టర్ ను ముంబై జైల్లో ఎందుకు పెడుతున్నారు !

రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ ఐఆర్ నమోదయ్యింది. అప్పుడు హైదరాబాద్ జైల్లో ఉంచాలి కాని ముంబై ఎందుకు అనేది తెలుసుకుందాం.


Published Sep 19, 2024 06:33:00 PM
postImages/2024-09-19/1726751037_Screenshot20240919183101.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు. అయితే అతనను గోవాలోని  ఓ లాడ్జిలో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్​లోని ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొస్తున్నారు. అయితే జానీ మాస్టర్​ను ఏ జైలుకు తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. జానీ మాస్టర్ ను ముంబై జైలులో ఉంచాలనుకుంటున్నారట. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ ఐఆర్ నమోదయ్యింది. అప్పుడు హైదరాబాద్ జైల్లో ఉంచాలి కాని ముంబై ఎందుకు అనేది తెలుసుకుందాం.


రాయదుర్గంలో జరిగినా ...శ్రేష్ట చెబుతున్నట్లు ముంబై హోటల్​లో ఎఫెన్స్ జరిగింది. ప్లేస్ ఆఫ్ ది ఎఫెన్స్ లెక్క ప్రకారం అయితే.. జానీ మాస్టర్​ను ముంబైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే జానీ మాస్టర్ ను ముంబై జైల్లో ఉంచుతారని టాక్.ఆమె పోలీసు స్టేషన్​లో జానీ ఎక్కడ అంటూ రచ్చ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే మాస్టర్ అరెస్ట్​కు ఆమె భార్యనే కారణమంటూ పుకార్లు వస్తున్నాయి. భర్త జాడ ఆమె బయటపెట్టడంతో పోలీసులు ఆ లొకేషన్​కు వెళ్లి అదుపులోకి తీసుకున్నారని వినిపిస్తోంది. 


అయితే జానీ మాస్టర్ పై అందరు సినీ ప్రముఖులు కామెంట్లు చేస్తున్నారు. జానీ మాస్టర్ నుంచి ఇలాంటి ఘటనను ఎక్స్ పర్ట్ చెయ్యమని అంటున్నారు. ట్విట్టర్ వేదికగా సినీ ప్రముఖులంతా జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mumbai johnmaster case

Related Articles