Sumalatha: జానీ మాస్టర్ కి విడాకులిస్తా..?

జానీ మాస్టర్ కి సంబంధించి ఒక్కొక్క బాగోతం బయటపడడంతో చాలామంది ఇన్ని రోజులు ఆయన్ని అభిమానించిన వాళ్లు తిట్టుకుంటున్నారు. అంతేకాదు ఇండస్ట్రీ నుండి ఎంతోమంది బాధిత మహిళకు సపోర్టుగా నిలుస్తున్నారు.


Published Sep 19, 2024 08:03:15 PM
postImages/2024-09-19/1726756395_janisumalatha.jpg

న్యూస్ లైన్ డెస్క్: జానీ మాస్టర్ కి సంబంధించి ఒక్కొక్క బాగోతం బయటపడడంతో చాలామంది ఇన్ని రోజులు ఆయన్ని అభిమానించిన వాళ్లు తిట్టుకుంటున్నారు. అంతేకాదు ఇండస్ట్రీ నుండి ఎంతోమంది బాధిత మహిళకు సపోర్టుగా నిలుస్తున్నారు.అంతేకాకుండా  పెద్ద హీరో అయినటువంటి అల్లు అర్జున్ ఆమెకు సపోర్ట్ ఇచ్చి గీతా ఆర్ట్స్ లో ఆమెకు పని ఇస్తా అనడంతో చాలామంది అల్లు అర్జున్ ని మెచ్చుకుంటున్నారు.

ఇక మరికొంత మందేమో తప్పంతా ఆ అమ్మాయిదేనని, ఆరు సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్న ఆ అమ్మాయి ప్రస్తుతం ఏదో గొడవలు రాబట్టే ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేస్తుంది.ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుంది అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే..తాజాగా హైదరాబాద్ ఎస్ ఓ టి పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో హాజరు పరచబోతున్నారు.

అయితే ఇలాంటి వేళ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా సంచలన కామెంట్లు చేసింది.నా భర్తకు విడాకులు ఇస్తానంటూ సుమలత మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ సుమలత అలా ఎందుకు మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం.. చాలామంది నా భర్తని లవ్ జిహాదీ  కేసు అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ నా భర్తకి దేశం అంటే ఎంతో ఇష్టం. దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అలాంటి నా భర్త పై ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు..

నా భర్తకు ఎప్పుడైతే అవార్డు వచ్చిందో అప్పటినుండి ఆయన వెనుక ఎంతో మంది కుట్రలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ అత్యాచార కేసు కూడా ప్లాన్ ప్రకారమే చేసే ఇరికించారు. ఒకవేళ నా భర్త ఆ అమ్మాయిని లైంగికంగా వేధించి అత్యాచార కేసులో నిందితుడిగా   రుజువైతే నేను కచ్చితంగా ఆయనకు విడాకులు ఇచ్చి వదిలేస్తాను.. అంతేకాదు నా భర్త పై కేసు పెట్టిన ఆ అమ్మాయికి ఇప్పటికే ఎన్నో ఎఫైర్లు ఉన్నాయి. చాలామందితో తిరిగింది అంటూ సంచలన కామెంట్స్ చేసింది జానీ మాస్టర్ భార్య సుమలత.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu allu-arjun dance-master jani-master jani-master-arrest sumalatha sreshta

Related Articles