jani master: జానీ మాస్టర్ పై కుట్ర అంతా...అతడిదే ప్లాన్ ?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.


Published Sep 28, 2024 12:05:00 PM
postImages/2024-09-28/1727505362_janimaster95831726562886.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే గత మూడు రోజులు జానీ మాస్టర్ కు పోలీసులు కస్టడీలో విచారణ కొనసాగుతుంది. జానీ భార్య అయేషా తన భర్తను కలిసేందుకు నార్సింగ్ పోలీసులు ఫర్మిషన్ ఇవ్వడంతో.. ఆమె ఇంటి నుంచి జానీ మాస్టర్ కు భోజనం తీసుకువచ్చారు. తన కేసు వెనుక ఉన్నది...ఏ హీరో ఉన్నాడో తనతో చెప్పాడని తెలిపింది.


అయేషా మీడియాతో  .. ‘ జైల్లో జానీ ప్రస్తుతానికి బాగనే ఉన్నారు. కాకపోతే బయట భోజనం కాబట్టి కాస్త ఇబ్బంది పడ్డారు. అందుకే ఇంటి నుంచి చికెన్, బిర్యానీ, రైస్ తీసుకెళ్లాను . పిల్లల్ని మిస్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆయన ఏ తప్పు చెయ్యలేదు. చేసినట్లయితే ఆ అమ్మాయి వెంటనే బయటకు వచ్చేది. ఇప్పుడు ఫేమ్ వచ్చాక పోలీస్ స్టేషన్ కు వెళ్లదు. కావాలనే తన పై చేస్తున్న కుట్రని తనతో చెప్పినట్లు అయేషా తెలిపారు.


 ఎన్నో సంవత్సరాలుగా శిష్యురాలిగా ఉన్న అమ్మాయి లైంగిక ఆరోపణలు చేస్తే ఎవరైనా నమ్ముతారా అని ఆయేషా ప్రశ్నించింది. తనకు మాస్టర్ లైఫ్ ఇచ్చారని చెప్పిన అమ్మాయి .. ఇప్పుడు వేధించాడని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.  డబ్బు ఆశ చూపించి ఇలా చేసి ఉండవచ్చని అన్నారు. గురువుని మోసం చేస్తే వచ్చే పరిణామాలు తను చూస్తుందనిఅన్నారు.జానీ మాస్టర్ విచారణ కస్టడీ నేటితో ముగియనుంది. అనంతరం ఈరోజు ఉదయం జానీ మాస్టర్ ను పోలీసులుకోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడు మీడియాలో వినిపిస్తున్న పేరే జానీ మాస్టర్ చెప్పారని టాక్. అతడే అంతా చేస్తున్నట్లు వారు అనుకుంటున్నారట.

newsline-whatsapp-channel
Tags : police ayesha-kaduskar jani-master sreshta

Related Articles