తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవిని దేవుడని కొలుస్తారు తప్ప నోటితో పల్లెత్తు మాట కూడా అనరు. ఎందుకంటే ఆయన ఎవరికి కూడా ఇంతవరకు అన్యాయం
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవిని దేవుడని కొలుస్తారు తప్ప నోటితో పల్లెత్తు మాట కూడా అనరు. ఎందుకంటే ఆయన ఎవరికి కూడా ఇంతవరకు అన్యాయం చేయలేదు. సొంతంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా తన కుటుంబాన్ని మొత్తం చేరదీసి ఎదిగేలా చేసాడని చెప్పవచ్చు. అలాంటి చిరంజీవి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మెగాస్టార్ గా మారారు.
ఈయన కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా ఎదురులేరు అనిపించుకున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాల్లో దూసుకుపోతున్నారు. అంతటి ఘనత కలిగినటువంటి చిరంజీవిని జెడి చక్రవర్తి దుర్మార్గుడు అంటూ మాట్లాడారు. ఆయన ఏ సందర్భంలో అలా అన్నారు, ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అలాంటి జెడీ చక్రవర్తి రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలోనే శివా సినిమా ద్వారా ఒక రోల్ లో నటించే అవకాశం ఇచ్చారు. అలా నటుడిగా మారిన జేడీ చక్రవర్తి అంచలంచలుగా ఎదిగాడు.
అయితే ఆయన ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా చెబుతారు. అలాంటి జేడి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కినేని నాగార్జున అంతం చిత్రంలో అసిస్టెంట్ డైరెక్ట్ గా పనిచేస్తున్న రోజులవి. ఆ సినిమా షూటింగ్ లొకేషన్ పక్కన చిరంజీవి ఘరానా మొగుడు షూటింగ్ కూడా జరుగుతుంది. అయితే జె.డి చక్రవర్తి ఈ రెండు షూటింగ్లను చూసేవాడు. ఫైట్ లో ఉండే ఆర్టిస్టులంతా మారిపోతున్నారు యూనిట్ సభ్యులు కూడా మారుతున్నారు. కానీ చిరంజీవి మాత్రమే నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఇక ఆయన చూస్తున్నటువంటి జెడి చక్రవర్తి మాత్రం మనసులో ఇంతటి పని రాక్షసున్ని, దుర్మార్గున్ని ఎప్పుడు చూడలేదు అనుకున్నాడట.
అయితే ఒక రోజు చిరంజీవి లొకేషన్ లో కారులో పడుకున్నాడు. ఏసీ రూమ్ లో పడుకోకుండా కారులో పడుకున్నాడు ఏంటి అని జెడి అడిగాడట. అయితే నేను లోపల పడుకుంటే వీళ్లు నిద్ర లేపరు. ఇక్కడే పడుకుంటే షాట్ రెడీ చిరంజీవి గారు అనగానే నేను లేచి వెళ్ళిపోవచ్చు అని చిరంజీవి అన్నారట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో జెడి చక్రవర్తి చిరంజీవి దుర్మార్గుడు పని రాక్షసుడు అని అన్వయిస్తూ అసలు విషయాన్ని బయట పెట్టారు.