ఈ విచారణలో జానీ మాస్టర్ సంచలన నిజాలు బయటపెట్టాడు. ఈ విచారణ లో జానీ మాస్టర్ డైరక్టర్ సుకుమార్ మాస్టర్ పేరును కూడా తెలిపారు. ముఖ్యంగా బాధితురాలే తనను అలా వేధించిందని జానీ మాస్టర్ పేర్కొన్నట్లు సమాచారం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : మహిళ కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు పోలీస్ కస్టడీ కూడా ఇచ్చింది. ఈ రోజు మూడో రోజు.గత మూడు రోజులుగా పోలీసులు కస్టడీలో జానీ మాస్టర్ ను విచారణ జరుగుతుంది. జానీ మాస్టర్ లాయర్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. ఈ విచారణలో జానీ మాస్టర్ సంచలన నిజాలు బయటపెట్టాడు. ఈ విచారణ లో జానీ మాస్టర్ డైరక్టర్ సుకుమార్ మాస్టర్ పేరును కూడా తెలిపారు. ముఖ్యంగా బాధితురాలే తనను అలా వేధించిందని జానీ మాస్టర్ పేర్కొన్నట్లు సమాచారం.
అత్యాచార కేసులో తనను ఇరికించారని .. ‘నేను ఏ తప్పు చేయలేదు. నాపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి. ఇకపోతే ఢీ షో ద్వారా తనకు తానే నాతో పరిచయం పెంచుకుంది. అలాగే మైనర్ గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధం. కేవలం తన టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాను. కాని తను మాత్రం తనకు ఫేమ్ వచ్చాక నన్ను ఇరికించడానికి చూస్తుంది.
తను నా భార్యను వదిలేసి..తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. ఆ టార్చర్ భరించలేక ..నేను డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాను. సుకుమార్ పిలిచి మాట్లాడిన కూడా బాధితురాలిలో ఏ మాత్రం మార్పు రాలేదు. అయితే ఇలా ఇరికిస్తుందని అనుకోలేదు. ఇఫ్పుడిప్పుడే ఇండస్ట్రీ లో ఎదుగుతున్నాను. తొక్కేయడానికే ఇలా చేస్తున్నారని అన్నారు. అయితే ఈ రోజుతో ..జానీ మాస్టర్ విచారణ కంప్లీట్ అవుతుంది. అంతేకాదు నేడు పోలీసులు జానీ మాస్టర్ ను రంగారెడ్డి కోర్టుకు ప్రవేశపెట్టనున్నారు.