Congress: నాడు బెస్ట్ పీహెచ్‌సీ.. నేడు కేంద్రానికి తాళం

నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉత్తమ వైద్య సేవలు అందించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్లు లేక సాయంత్రం 4 గంటలకే తాళం వేసే దుస్థితికి వచ్చింది.


Published Aug 08, 2024 03:07:04 PM
postImages/2024-08-08/1723109824_cong333.PNG

న్యూస్ లైన్ డెస్క్: నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉత్తమ వైద్య సేవలు అందించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్లు లేక సాయంత్రం 4 గంటలకే తాళం వేసే దుస్థితికి వచ్చింది. కాగజ్ నగర్‌లోని కౌటాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ, జాతీయస్థాయిలో వైద్యారోగ్య శాఖ క్వాలిటీ సేవలు అందిస్తున్న జాబితాలో కేంద్రం పలుమార్లు చోటు దక్కించుకుంది.

వందల సంఖ్యలో ప్రసవాలు చేసిన కేంద్రం.. అర్ధరాత్రి వచ్చినా డెలివరీ చేసేవారు. కానీ ఇప్పుడు సాయంత్రం 4 అయిందంటే కేంద్రానికి తాళం వేసి ఉంటుంది. రెగ్యులర్ డాక్టర్లు లేక ఇంఛార్జిల పర్యవేక్షణలో అంతంత మాత్రంగానే వైద్య సేవలు అందుతున్నాయి. ఏప్రిల్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క డెలివరీ జరగలేదంటే అంత దీనస్థితికి పడిపోయింది ఈ ఆరోగ్య కేంద్రం. దీంతో ప్రభుత్వం ఈ ఆరోగ్య కేంద్రంపై దృష్టి సారించాలని డాక్టర్లు కోరుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana congress health-news doctors cm-revanth-reddy

Related Articles